Mangli : నాకు పాటలు తప్ప స్కాంలు తెలియవు: మంగ్లీ ఎమోషనల్!
ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ అల్లుకున్న వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసం జరిగిందంటూ నమోదైన కేసుపై మంగ్లీ స్పందించారు.
ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ అల్లుకున్న వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసం జరిగిందంటూ నమోదైన కేసుపై మంగ్లీ స్పందించారు.
సింగర్ మంగ్లీకేసు రోజుకో మలుపు తిరుగుతుంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుంది. బాధితులు పెరుగుతున్న కొద్ది రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. ఈ కేసులో కీలక నిందితులుగా అనుమానిస్తున్న రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్లు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.
సింగర్ మంగ్లీ తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు. స్టేజ్ మీద స్టెప్పులేసే మంగ్లీ, ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఈ 200 కోట్ల కథ ఏంటి? ఎవరిని నమ్మించి ముంచేశారు? ఈ స్కామ్లో నిజంగానే మంగ్లీ పాత్ర ఉందా?
సింగర్ మంగ్లీ కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. మంగ్లీ కేసుకు సంబంధించి.. ఫిర్యాదు చేయడానికి పంజాగుట్ట స్టేషన్ కు వచ్చిన అడ్వకేట్ సుబ్బారావుకు పోలీసులకు మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. లాయర్ కు పోలీసులు డ్రంకెన్ టెస్ట్ నిర్వహించడం సంచలనంగా మారింది.
ప్రముఖ గాయనీ మంగ్లీ తమ్ముడు శివ మధు అనే వ్యక్తి తో కలిసి కొంతమంది ప్రజలను మోసం చేసి పది కోట్ల వరకు వసూలు చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మంగ్లీ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది