/rtv/media/media_files/2026/04/11/fotojet-39-2026-04-11-21-21-07.jpg)
cheating case on singer mangli
Singer Mangli : ప్రముఖ గాయనీ మంగ్లీ తమ్ముడు శివ మధు అనే వ్యక్తి తో కలిసి కొంతమంది ప్రజలను మోసం చేసి పది కోట్ల వరకు వసూలు చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది... మరోవైపు భరత్ అనే అతను భార్యతో పాటు డబ్బులు కట్టలు పెట్టుకొని లెక్కిస్తున్న వీడియో వైరల్ అయింది ..ఈ నేపథ్యంలో మంగ్లీ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది ఈ డబ్బు లెక్కించే వీడియోకి నాకు సంబంధం లేదని.. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో Bharath Cholan ఉన్నాడని అడ్వకేట్ సుబ్బారావు చెబుతున్నారు. ఈ కేసు ప్రస్తుతం రెండు వైపుల నుంచి వచ్చిన ఆరోపణలు, ప్రత్యారోపణలతో పెద్ద వివాదంగా మారుతోంది. ఒక వైపు బాధితుల తరఫున అడ్వకేట్ సింగపోగు సుబ్బారావు చేసిన ఆరోపణలు, మరోవైపు సింగర్ మంగ్లీ చేసిన ఫిర్యాదు ఇవి రెండూ ఈ ఘటనను మరింత క్లిష్టంగా మార్చాయి.
/filters:format(webp)/rtv/media/media_files/2026/04/11/fotojet-38-2026-04-11-21-21-38.jpg)
నిజానికి ఈ కథ మొదలైంది ఈ రోజు కాదు. సుమారు రెండు నెలల క్రితం. కొంతమంది బాధితులు తమను “పెట్టుబడుల పేరుతో మోసం చేశారు” అంటూ అడ్వకేట్ సుబ్బారావును ఆశ్రయించారు. ఆ వివరాలు విన్న తర్వాత సుబ్బారావు స్వయంగా ఈ వ్యవహారంపై లోతైన విచారణ చేపట్టారు. ఆ విచారణలో ఈ ఘటనలో మధు అనే వ్యక్తి ప్రధాన పాత్ర పోషించాడని గుర్తించారు. అతనితో పాటు మంగ్లీ సోదరుడు శివ, మరికొందరు వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారని ఆయన చెబుతున్నారు. బాధితులు చెప్పినదాని ప్రకారం, మంగ్లీ పేరు వినిపించడం వల్లే తాము నమ్మి పెట్టుబడులు పెట్టామని తెలిపారు.
ఈ మోసం సాధారణంగా కనిపించే పెట్టుబడి స్కీమ్ కాదు. రియల్ ఎస్టేట్, ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్, ట్రేడింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడతామని చెప్పి అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపించారు. “Gokulanandana Infra India Private Limited” అనే పేరుతో ఈ కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదట కొంతమందికి రిటర్న్స్ ఇచ్చి నమ్మకం కల్పించారు. డబ్బులు ఇచ్చిన దానికంటే ఎక్కువ వస్తుండంతో చాలాంమంది డబ్బులు పెట్టడానికి ముందుకు వచ్చారు. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించినట్లు బాధితులు తెలిపారు. మొత్తంగా వందల మంది నుంచి కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుబ్బారావు చెప్తున్నదాని ప్రకారం, ఈ కేసులో మొత్తంగా 150 నుంచి 200 కోట్ల వరకు సేకరణ జరిగి ఉండొచ్చని అనుమానం. అయితే అధికారిక ఫిర్యాదులో మాత్రం సుమారు 9.5 నుంచి 10 కోట్ల మధ్య మొత్తాన్ని ప్రస్తావించారు. ఇది కేసు ఇంకా ప్రాథమిక దశలో ఉందని, విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సూచిస్తోంది.
వాస్తవాలను తెలుసుకోవడానికి సుబ్బారావు మంగ్లీని సంప్రదించడానికి ప్రయత్నించారు. అయితే ఆమె తనతో అసభ్యంగా, అహంకారంగా మాట్లాడినట్లు ఆయన ఆరోపించారు. తరువాత ఈ విషయాన్ని మీడియా ద్వారా బయటపెట్టడంతో, మంగ్లీ తనకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పి, కేసులో తన పేరును తీసేయాలని కోరిందని ఆయన చెబుతున్నారు. అలాగే కేసు ఉపసంహరించుకోవాలని డబ్బులు ఆఫర్ చేసినట్లు కూడా ఆరోపించారు. కానీ సుబ్బారావు ఆ ఆఫర్‌ను తిరస్కరించి, బాధితులకు న్యాయం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారని తెలిపారు. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. సుబ్బారావు చెప్పిన ప్రకారం, పంజాగుట్టలో ఒక కార్యాలయంలో మంగ్లీ, ఆమె లాయర్ పూజారి నాగేశ్వరరావు, డైరెక్టర్ వేణు ఉడుగుల తదితరులతో ఒక సమావేశం జరిగింది. అక్కడ కూడా కేసు పెట్టవద్దని, మీడియా ఇంటర్వ్యూలను తొలగించాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈ సమయంలో తనకు ప్రాణహాని బెదిరింపులు కూడా వచ్చాయని, “హిట్ అండ్ రన్” చేసి చంపుతామని హెచ్చరించినట్లు ఆయన ఆరోపించారు.
ఈ ఒత్తిళ్ల మధ్య కూడా సుబ్బారావు వెనక్కి తగ్గకుండా పోలీసులను ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు అయింది. ఈ కేసులో మధు, భారత్ చౌహాన్, శైలజ, శివ, మంగ్లీ పేర్లు ప్రస్తావనలోకి వచ్చాయి. బాధితుల సంఖ్య వందల్లో ఉండవచ్చని, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ మోసం ప్రభావం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో మరో ట్విస్ట్ వచ్చింది. సింగర్ మంగ్లీ కూడా నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ప్రతిఫిర్యాదు చేసింది. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, 150 కోట్ల మోసం ఆరోపణలు అసత్యమని ఆమె పేర్కొంది. సుబ్బారావు తనను బెదిరించాడని, కలవాలని ఒత్తిడి తెచ్చాడని, నిరాకరిస్తే అప్రతిష్ట కలిగిస్తానని హెచ్చరించాడని ఫిర్యాదులో చెప్పింది. అంతేకాకుండా, కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించారని కూడా ఆరోపించింది.
మంగ్లీ ఫిర్యాదుపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో BNS సెక్షన్లు 79, 351(3) కింద కేసు నమోదు అయింది. తన కుటుంబం కూడా ఈ ఘటన వల్ల మానసిక ఒత్తిడికి గురైందని ఆమె తెలిపింది. ఈ వ్యవహారంలో తాను నిర్దోషినని, చట్టపరంగా పోరాడతానని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ కేసు రెండు వైపుల ఆరోపణలతో ముందుకు సాగుతోంది. ఒకవైపు భారీ పెట్టుబడి మోసం ఆరోపణలు, మరోవైపు బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్: 258/2026 సెక్షన్లు: BNS 351(2), 352 కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇవి రెండు కేసులు విచారణలో కీలకంగా మారనున్నాయి. డబ్బుల లావాదేవీలు, సంబంధాలు, కాల్ రికార్డులు, సమావేశాలు ఇవన్నీ పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారనున్నాయి.
మొత్తానికి, ఇది సాధారణ కేసు కాకుండా, పెద్దపెద్ద రాజకీయ నాయకులు ఈ కేసులో ఉన్నారని కొంతమంది ప్రముఖు వ్యక్తుల పేర్లు వినిపిస్తున్న సెన్సిటివ్ కేసుగా మారింది. విచారణ పూర్తయ్యే వరకు నిజానిజాలు బయటకు రావాల్సి ఉంది. పోలీసులు ఈ కేసును ఏ దిశగా తీసుకెళ్తారు, ఎవరు నిజంగా బాధ్యులు అన్నది త్వరలో తేలే అవకాశం ఉంది.
Follow Us