Mangli Case : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. అడ్వకేట్‌కు పోలీసులకు మధ్య వార్‌

సింగర్‌ మంగ్లీ కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. మంగ్లీ కేసుకు సంబంధించి.. ఫిర్యాదు చేయడానికి పంజాగుట్ట స్టేషన్ కు వచ్చిన అడ్వకేట్‌ సుబ్బారావుకు పోలీసులకు మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. లాయర్ కు పోలీసులు డ్రంకెన్ టెస్ట్ నిర్వహించడం సంచలనంగా మారింది.

New Update
FotoJet (54)

Tension at Panjagutta Police Station

Mangli Case : సింగర్‌ మంగ్లీ కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. నిన్న అడ్వకేట్‌ సుబ్బారావు తనను డబ్బుల కోసం బెదిరించాడని ఆరోపిస్తూ మంగ్లీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు సుబ్బారావు సైతం మరోసారి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు రావడంతో స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మంగ్లీ కేసుకు సంబంధించి.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన అడ్వకేట్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. మంగ్లీ పలువురు దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసిందని ఆరోపిస్తున్న లాయర్‌ సుబ్బారావు మరోసారి బాధితుల తరఫున ఫిర్యాదు ఇవ్వడానికి లాయర్‌ సుబ్బారావు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అయితే బాధితులను వెంట తీసుకుని వస్తేనే ఫిర్యాదు స్వీకరిస్తామని స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు. అయితే అదేం పట్టించుకోని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు ఎంత చెప్పిన వినక పోవడంతో కొంత హైడ్రామా నెలకొంది.

 అయితే ఆయన పోలీసులతో ప్రవర్తిస్తున్న తీరుపట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతను మద్యం సేవించి వచ్చాడని అనుమానం రావడంతో ఆయన మద్యం సేవించారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు డ్రంకెన్ టెస్ట్ చేయాలని నిర్ణయించారు. అయితే దీనికి లాయర్‌ సుబ్బారావు నిరాకరించారు. అయితే టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే స్టేషన్‌లోకి అనుమతిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ సమయంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత, వాగ్వాదం చోటుచేసుకుంది. అయినా పట్టు వీడని పోలీసులు చివరికి  అడ్వకేట్‌కు డ్రంకెన్ టెస్ట్ నిర్వహించారు. ఆ టెస్ట్‌లో 27 పాయింట్లు నమోదైనట్లు తెలిసింది. దీనిపై స్పందించిన అడ్వకేట్ సుబ్బారావు తాను నిన్న(ఆదివారం) రాత్రి మద్యం సేవించినట్లు అంగీకరించాడు. ఈ ఘటనతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కొంత గందరగోళం నెలకొంది.  

ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ తమ విధి నిర్వహణలో భాగంగా నియమ, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. స్టేషన్‌లోకి వచ్చే వ్యక్తులు సక్రమంగా ఉండాలనే ఉద్దేశంతోనే టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. అయితే మంగ్లీ కేసును  పక్కదారి పట్టించడానికే డ్రంకెన్ టెస్ట్ చేస్తున్నారని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌లోకి వచ్చే వారందరికి ఇలాగే టెస్ట్ చేస్తున్నారా.? అని న్యాయవాది సుబ్బారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. టాపిక్‌ను డైవర్ట్ చేయడం కోసమే డ్రంకెన్ టెస్ట్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాగుట్ట పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని న్యాయవాది సుబ్బారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు