ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ అల్లుకున్న వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసం జరిగిందంటూ నమోదైన కేసుపై మంగ్లీ స్పందించారు. తనకు పాటల ప్రపంచం తప్ప స్కామ్‌ల గురించి ఏమీ తెలియదని, తనపై జరుగుతున్న ప్రచారం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మంగ్లీపై ఇటీవల ఒక కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో సుమారు రూ. 10 కోట్లు మోసం చేశారని, ఈ వ్యవహారంలో ఆమె ప్రమేయం ఉందని న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశారు. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం తన న్యాయవాదితో కలిసి మీడియాతో మాట్లాడిన మంగ్లీ ఎమోషనల్ అయ్యారు. తాను తప్పు చేసినట్లు నిరూపణ అయితే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనన్నారు.
ఆ కష్టం నాకు తెలుసు
బాధితుల ఆవేదన చూస్తుంటే తనకూ బాధగా ఉందని.. తాను కూడా పేదరికం నుంచి వచ్చినదాన్నే, ఆ కష్టం నాకు తెలుసునని మంగ్లి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. కొందరు పెడుతున్న కామెంట్లు చూసి కుమిలిపోతున్నానన్నారు. తన ఫొటోలను సంబంధం లేని విషయాల్లో వాడకండని సూచించారు.
ఈ వివాదాల వల్ల గత 30 రోజులుగా తన ప్రోగ్రామ్స్ అన్నీ వదులుకోవాల్సి వచ్చిందని మంగ్లి చెప్పుకొచ్చారు. తనను ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంగ్లీ తెలిపారు. మధు నాయక్, హిమకాంత్ రెడ్డి, సిద్ధు, సుబ్బారావు వంటి వ్యక్తులపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు.
Mangli : నాకు పాటలు తప్ప స్కాంలు తెలియవు: మంగ్లీ ఎమోషనల్!
ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ అల్లుకున్న వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసం జరిగిందంటూ నమోదైన కేసుపై మంగ్లీ స్పందించారు.