/rtv/media/media_files/2026/04/12/mangli-2026-04-12-17-23-05.jpg)
ingar mangli case
Singer Mangli: సింగర్ మంగ్లీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. తన పాటలతో.. పాటంటే మంగ్లీ, మంగ్లీ అంటే పాట అన్నట్లుగా ఎదిగారు. ఊరువాడ తన గొంతుతో ఉర్రూతలూగించిన ఈ జానపద కోకిల, ఇప్పుడు 'నోట్ల' డప్పు కొడుతోందా? స్టేజ్ మీద స్టెప్పులేసే మంగ్లీ, ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఈ 200 కోట్ల కథ ఏంటి? ఎవరిని నమ్మించి ముంచేశారు.? ఈ స్కామ్‌లో నిజంగానే మంగ్లీ పాత్ర ఉందా.? ఒకసారి కథనం చదవండి
ఒకప్పుడు మంగ్లీ గొంతు వింటే పల్లె పులకరించేది.. కానీ ఇప్పుడు మంగ్లీ పేరు వింటే వివాదాలు పలకరిస్తున్నాయి. తాజాగా 200 కోట్ల స్కామ్ ఆరోపణలు ఆమె చుట్టూ ముసురుకున్నాయి. ఒక విధంగా చెప్పలంటే మంగ్లీ టైమ్ అస్సలు బాలేదు.! మొన్న తిరుమలలో ప్రొటోకాల్ వివాదం.. అంతకుముందు బోనాల పాటలో పదాల గొడవ.. ఆ తర్వాత కాళహస్తిలో డ్యాన్స్ ఇష్యూ. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒకెత్తు.. ఇప్పుడు వచ్చిన '200 కోట్ల స్కామ్ మరో ఎత్తు. ఇది కేవలం పాటల గొడవ కాదు.. సామాన్యుల జేబులకు పడ్డ కన్నాల గురించి! మంగ్లీ మాట నమ్మి పైసలు పోగొట్టుకున్న బాధితులు, ఇప్పుడు ఆమెపై నిప్పులు చెరుగుతున్నారు.
Also Read: రక్తంతో తడిసి ముద్దైన రోడ్లు.. యాక్సిడెంట్‌లో 18 మంది మృతి
గోకుల నందన ఇన్ఫ్రా అనే కంపెనీలో మంగ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అయితే స్కామ్ జరిగింది కూడా ఇదే కంపెనీ పేరుతో కావడంతో మంగ్లీ కూడా ఈ స్కామ్‌లో ఉన్నారనే ఆరోపణలకు మరింత బలం చేకురింది. కంపెనీలో.. మంగ్లీ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనా? లేక వెనకుండి నడిపించిన డైరెక్టరా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. పోలీసులు 10 కోట్లు అంటే.. బాధితులు 200 కోట్లు అంటున్నారు. అంటే ఇక్కడ లెక్కల్లో భారీ మొత్తంలో తేడా కొడుతోంది! మంగ్లీ ఏమో నాకేం తెలీదు.. నేను అమాయకురాలిని అని నార్సింగిలో ఫిర్యాదు చేశారు. పంజాగుట్టలో ఆమెపై కేసు నమోదైతే.. ఆమె వెళ్లి నార్సింగిలో కంప్లైంట్ ఇవ్వడం చూస్తుంటే.. సీన్ చాలా రివర్స్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. తర్వాత మళ్లీ పంజాగుట్టలో కూడా ఫిర్యాదు చేశారనుకోండి అది వేరే విషయం.
విషయానికి వస్తే.. అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి మంగ్లీ ఆమె తమ్ముడు శివ, తన స్నేహితులు మధు, భరత్ చౌహన్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గోకుల నందన ఇన్ఫ్రా సంస్థలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి సుమారు 150 మందికిపైగా డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వద్దకు వచ్చి బాధితులు మోరపెట్టున్నారని సుబ్బారావు తెలిపారు. ఈ స్కామ్ విలువ సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ఫిర్యాదులో చెప్పారు. వాటీతో పాటు భరత్ చౌహన్ డబ్బు కట్టలను లెక్కిస్తున్న వీడియోను కూడా ఆయన రిలీజ్ చేశారు. దీంతో విషయం మరింత రాజుకుంది. ఈ టీమ్ వసూళ్లకి పాల్పడితే మంగ్లీ ప్రమోషన్ చేశారంటూ బాధితులతో కలిసి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. మరోవైపు 'మాకు కంపెనీ గురించి తెలియకపోయినా, మంగ్లీని చూసి, ఆమె మాటలు నమ్మి మా కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టాము. ఇప్పుడు కంపెనీ బోర్డు తిప్పేస్తే, ఆమెకు సంబంధం లేదనడం సరికాదు" అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతన్నారు.
Also Read: ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా..? 90's కుర్రాళ్ల కలలరాణి.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి
ఈ విషయంపై కాస్త లేటయినా ఘాటుగా రియాక్ట్ అయ్యారు మంగ్లీ. మనీ మ్యాటర్.. లాయర్ ఆరోపణలు.. ఈ రెండింటిని తిప్పికొట్టారు. తన వ్యక్తిత్వానికి భంగం కలిగేలా.. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల స్కామ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారామె. సోషల్ మీడియాతో ఎదిగిన తనను.. అదే సోషల్ మీడియా అప్రతిష్టపాలు చేస్తుందని ఊహించలేదని మంగ్లీ కన్నీరు పెట్టున్నారు. కాస్త ఎమోషనల్ అవుతూనే ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌తో సంబంధం లేదని మంగ్లీ కుండబద్దలు కొట్టారు. అడ్వకేట్ సుబ్బారావు సెలేబ్రిటిగా మారాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఫేమస్ అవ్వడమే తన లక్ష్యమని మంగ్లీ ఆరోపించారు. శ్రీముఖి అంటే క్రష్ అని చెప్పాడని మంగ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ద్వారా ఫేమస్ అయి బిగ్‌బాస్ లోకి వెళ్ళాలి సుబ్బారావు అనుకుంటున్నాడని అన్నారు. అందుకే నన్ను ఇలా ఇరికించాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ మంగ్లీ ఎమోషనల్ అయ్యింది. మంగ్లీ చెప్పింది నిజమైతే.. మరి స్కీమ్ పేరుతో జరిగిన స్కామ్‌లో ఉన్నదెవరు? పైసా వసూల్ డైరెక్షన్ ఎవరిది? వీడియోలో కన్పిస్తోన్న డబ్బంతా ఎవరి చేతుల్లోకి వెళ్లిపోయింది? మంగ్లీ ఆరోపిస్తున్నట్టు ఫేమ్ అయ్యేందుకే అడ్వకేట్ సుబ్బారావు ఇంత హంగామా చేస్తున్నారా అన్నది పోలీసుల విచారణలోనే తేలాలి. ఏది ఏమైనా మంగ్లీ వ్యవహరం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ మారింది.
Follow Us