Google Maps: గూగుల్ మ్యాప్స్ తప్పిదం.. పోలీసులను చితకబాదిన స్థానికులు
అసోంలో ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని వెళ్లారు. కానీ పోలీసులను దొంగలుగా భావించిన స్థానికులు వాళ్లని చితకబాదారు. రాత్రంతా కట్టేసి బందీలుగా ఉంచుకున్నారు. అసలు విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులకు సారీ చెప్పి వదిలేశారు.
HYD: శ్రీతేజ్‌ను చూడ్డానికి రావొద్దు–అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీస్
హీరో అల్లు అర్జున్‌కు రాంగోపాలపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించడానికి అతన్ని రావద్దని..వచ్చినా తప్పనిసరిగా తమ సూచనలు పాటించాలని చెప్పారు.
Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోరుతున్న పోలీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఏ11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు.
Kadapa: పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐపై దాడి
వైఎస్సార్ జిల్లాకి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టింది. పోలీసులు వెంటనే కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. అయితే యాక్సిడెంట్‌కి కారణమైన వారిని ఎస్ఐ వదిలేశాడని గాయపడిన వారి కుటుంబ సభ్యులు అతనిపై దాడికి పాల్పడ్డారు.
Maoist: మావోయిస్టు లచ్చన్న టీం వాష్ అవుట్.. RTVతో ఎస్పీ రోహిత్‌రాజ్!
మావోయిస్టుల కదలికలు, కార్యకలాపాలపై ఫుల్ ఫోకస్ పెట్టామని భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ చెప్పారు. ఇటీవల లచ్చన్న టీంను పూర్తిగా వాష్ అవుట్ చేశామన్నారు. మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు.
రూ.3.3 కోట్ల 1,100 సెల్ఫోన్లు స్వాధీనం.. బాధితులకు అందించిన పోలీసులు
చోరీకి గురైన సెల్ ఫోన్ కేసులను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. 45 రోజుల్లోనే రూ.3.3 కోట్ల విలువైన 1,100 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందించారు. చోరీ ఫోన్లు కొన్నా, దొంగిలించిన నేరమేనని సైబరాబాద్ డీసీపీ కె.నరసింహ చెప్పారు.
/rtv/media/media_files/2025/01/08/T08cU9anZCDkXHDLFC2J.jpg)
/rtv/media/media_files/2025/01/09/BDsmm0CHum969F0aNYLR.jpg)
/rtv/media/media_files/2024/12/24/20rXuOB7SdH7xcppfR3x.jpg)
/rtv/media/media_files/2024/12/24/oNwPUsabcoS9upsOuxSF.jpg)
/rtv/media/media_files/drYlhoC0rBGUaTtQ3UIq.jpg)
/rtv/media/media_files/2024/12/30/bOA9QP6YecKbq8GSkyu4.jpg)
/rtv/media/media_files/2024/12/11/E0mj456gjKzt5HPOL0Ez.jpg)