Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోరుతున్న పోలీసులు

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఏ11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌ బెయిల్ క్యాన్సిల్ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు.  బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

New Update
Allu arjun sandhya theatre issue Interrogation

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ

పుష్ప–2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఆమె మరణించగా...శ్రీతేజ్ కిమ్స్ ఆసపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దొని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. అతను డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని...బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలా అయితే మొత్తం కేసు తారు మారు అవుతుందని...అందుకే అతనికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కోరుతున్నారు. 

దర్యాప్తు కొనసాగుతోంది...

అంతకు ముందు అల్లు అర్జున్ పీఎస్‌లో కూడా సహకరించలేదని...అందుకే అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే ఇదే పరిస్థితి మళ్ళీ ఎదురౌతుందని..కేసుకు అస్సలు సహకరించే అవకాశం ఉందడదని పోలీసులు వాదిస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందువలనే బెయిల్ వద్దంటున్నామని పోలీసులు కోరారు.  మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ఆరోగ్యం మళ్ళీ విషమించింది. అతనిని డాక్టర్లు మళ్ళీ వెంటిలేటర్ మీద పెట్టారు.  ఒకవేళ బాబుకు ఏదైనా అయితే అల్లు అర్జున్‌ను మళ్ళీ​రెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

Also Read: USA: అమెరికా ట్రెజరీపై చైనా సైబర్ దాడి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sri Rama Navami Shobha Yatra : వైభవంగా కొనసాగుతోన్న శ్రీరామ శోభాయాత్ర

హైదరాబాద్‌లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. వేలాదిమంది భక్త జన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతోంది. మంగళ్‌హాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం ధూల్ పేటకు చేరుకుంది.

New Update
Sri Rama Navami Shobha Yatra

Sri Rama Navami Shobha Yatra

Sri Rama Navami Shobha Yatra : హైదరాబాద్‌లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. వేలాదిమంది భక్త జన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతోంది. నగరంలోని మంగళ్‌హాట్ ప్రాంతంలోని సీతారాం భాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం ధూల్ పేటకు చేరుకుంది. కాగా శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా పలు హిందూ సంఘాలు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. మంగళ్‌హాట్ ప్రాంతంలోని సీతారాం భాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తం 6.3 కి.మీ మేర ఈ శోభాయాత్ర సాగుతుంది.

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

 ఈ శోభాయాత్రకు వేలల్లో రామ భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. దాదాపు 20 వేల మంది విధుల్లో ఉండి పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి
 
శోభాయాత్ర మార్గమంతా అడుగడుగున సీసీ కెమెరాల నిఘా కొనసాగనుంది. శోభాయాత్ర పర్యవేక్షణ కోసం జాయింట్ కంట్రోల్ రూమ్‌తో పాటు బంజారాహిల్స్ లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతలో భాగంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ పోలీసులు శోభాయాత్రను మానిటర్ చేయనున్నారు. భక్తులు శాంతియుతంగా, భక్తిభావంతో శోభాయాత్రలో పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు. 

Also read: Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు