Kerala: వాయనాడ్‌లో 49 మంది చిన్నారులు గల్లంతు
కేరళలోని వాయనాడ్‌లో జరిగిన విలయంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికి 300 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. ఆచూకీ దొరకని వారిలో 49 మంది చిన్నారులున్నారని ప్రభుత్వం తెలిపింది.
కేరళలోని వాయనాడ్‌లో జరిగిన విలయంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికి 300 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. ఆచూకీ దొరకని వారిలో 49 మంది చిన్నారులున్నారని ప్రభుత్వం తెలిపింది.
ఏపీ విజయవాడలో ఇంటర్ విద్యార్థిని సుంకర లక్ష్మి మిస్సింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. శనివారం కాలేజీకి వెళ్తున్నట్లు చెప్పి కనిపించకుండా పోవడంతో వార్డెన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. తల్లి గునమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
అమెరికాలోని షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ కనిపించడం లేదని అక్కడి భారత రాయాబార కార్యాలయం తెలిపింది. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
నేపాల్ మేయర్ కూతురు ఆరతి హమాల్ గోవాకు రాగా.. ఆమె గత సోమవారం నుంచి కనిపించడం లేదని స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న పోలీసులు భారత పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అయితే ...ఆమె ఓషో మెడిటేషన్ ఫాలో అవుతుందని, దాని కోసం కొద్ది నెలలుగా ఆమె గోవాలో ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
మణిపూర్‌లో మళ్ళీ అల్లర్లు జరిగాయి. నలుగురు అదృశ్యమయ్యారు. దీంతో కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ మధ్య కాల్పుల ఘటన జరిగింది.
నటి , బీజేపీ నాయకురాల జయప్రద కనిపించడం లేదని ఉత్తర్‌ప్రదేశ్ రామ్‌పూర్ జి్లలాలో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. 2019 ఎన్నికల సమయంలో ఆమె ఎన్నికల నియమాళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమె పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.
కరీంనగర్ లో తప్పిపోయిన 13 ఏళ్ల బాలిక వశిష్ట కృష్ణను ఎట్టకేలకు పోలుసులు గుర్తించారు. ఐదు బృందాలుగా ఏర్పడి గాలించిన పోలీసులు శుక్రవారం రాత్రి 1:09 గంటలకు హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ లో పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో మిస్సయిన భారతీయ విద్యార్థిని మయూషి భగత్ ఆచూకీ చెప్పిన వారికి అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ 10 వేల డాలర్ల రివార్డును ప్రకటించింది.