Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఆ ప్రశ్నకు ఫుల్ మార్క్స్
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం సెకండియర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో ఓ ప్రశ్న అస్పష్టంగా ముద్రణ అయ్యింది. దీంతో ఈ ప్రశ్నకు ఆన్సర్ రాసేందుకు యత్నించిన విద్యార్థులకు నాలుగు మార్కుల చొప్పున ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.