/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/10th-jpg.webp)
inter exams
ఏపీలో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా మనమిత్ర పేజీ ద్వారా విద్యార్థులకు అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇంటర్ విద్యార్థులకు కాలేజీ ఫీజులు కట్టకుండా ఉన్నా కూడా హాల్ టికెట్లు నిలిపివేయడం వంటి ఘటనలు లేకుండానే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చూడండి: అంతా సర్వనాశనం అయిపోయింది..అక్రమవలదారులుగా వచ్చిన భారతీయుల ఆవేదన
వాట్సాప్‌లో హాల్ టికెట్లు..
ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో దాదాపుగా 10 లక్షల మంది విద్యార్దులు పరీక్షలు రాయనున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం వాట్సాప్ నంబర్ 95523 00009 నుంచి ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇంటర్‌తో పాటు పదో తరగతి విద్యార్థులకు కూడా హాల్ టిక్కెట్లను వాట్సాప్‌లో అందించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఏపీలో మార్చి 1వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.
ఇది కూడా చూడండి: America Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!
ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించింది. పౌరసేవలు అందించేందుకు దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చింది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ ఈ వాట్సాప్ సేవలను ప్రారంభించారు. ఇకపై అన్ని ప్రభుత్వ ధృవపత్రాలన్నీ కూడా వాట్సాప్ ద్వారా ప్రజలకు అందేందుకు దీన్ని తీసుకొచ్చారు. దీని కోసం అధికారిక వాట్సాప్ నంబర్ 919552300009 ను కూడా మంత్రి లోకేష్ ప్రకటించారు.
ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్ గ్యాప్ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?
ఈ వాట్సాప్ గవర్నెన్స్ కింద మొదటి విడతలో 161 సేవలను అందించనున్నారు. ప్రజలు సర్టిఫికేట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అన్ని అందించేందుకు 2024 అక్టోబరు 22న ప్రభుత్వం మెటాతో ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చింది.
ఇది కూడా చూడండి: Delhi BJP : ఢిల్లీలో బీజేపీ గెలిస్తే సీఎం అయ్యేది ఎవరు?... లిస్టులో ఉన్నది వీళ్లే!