Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆ ప్రశ్నకు ఫుల్‌ మార్క్స్‌

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం సెకండియర్ ఇంగ్లీష్‌ క్వశ్చన్‌ పేపర్‌లో ఓ ప్రశ్న అస్పష్టంగా ముద్రణ అయ్యింది. దీంతో ఈ ప్రశ్నకు ఆన్సర్‌ రాసేందుకు యత్నించిన విద్యార్థులకు నాలుగు మార్కుల చొప్పున ఇవ్వాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది.

New Update
Telangana Intermediate Exams

Telangana Intermediate Exams

తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే సెకండియర్ ఇంగ్లీష్‌ క్వశ్చన్‌ పేపర్‌లో ఓ ప్రశ్న అస్పష్టంగా ముద్రణ అయ్యింది. దీంతో ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. క్వశ్చన్‌ పేపర్‌లో అస్పష్టంగా ముద్రించిన ఏడో ప్రశ్నకు పూర్తి మార్కులు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఈ ప్రశ్నకు ఆన్సర్‌ రాసేందుకు యత్నించిన విద్యార్థులకు నాలుగు మార్కుల చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.  

Also Read: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్‌ట్విస్ట్.. ప్రముఖ వ్యాపార వేత్త అరెస్ట్

సోమవారం జరిగిన సెకండియర్‌ ఇంగ్లీష్‌ పేపర్‌లో ఏడో ప్రశ్న ఇచ్చిన చార్ట్‌లో ముద్రణలో లోపం జరిగింది. దీంతో బాక్సులు అస్పష్టంగా కనిపించాయి. అవి స్పష్టంగా లేకపోవడంతో ఈ ప్రశ్నకు సరైన సమాధానం రాయలేకపోయినట్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇంటర్‌ బోర్డు దృష్టికి తీసుకెల్లారు. సబ్జెక్టు నిపుణులు, ఇతరులతో చర్చించిన తర్వాత విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండాలని ఇంటర్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా మార్చి 5న మొదలైన ఇంటర్‌ పరీక్షలు 25 వరకు జరగనున్నాయి.  

Also Read: H1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లకి బిగ్‌ షాక్.. రావడం కష్టమే

Also Read: పన్నులు తగ్గించాలని అడగొద్దు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ladies Hostels : అర్థరాత్రి దొంగ హల్ చల్  లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి...

అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్నాడు ఓ దొంగ. అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

New Update
Girls Hostels

Girls Hostels

Ladies Hostels  : అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్న ఓ దొంగ వ్యవహారం మధురానగర్ లో చోటు చేసుకుంది.ఆ దొంగ అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్‌కు చెందిన సింధు(29) నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ.. మధురానగర్‌లోని శ్రీ సాయి సద్గురు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో గత ఐదేళ్ల నుంచి ఉంటుంది. తన బ్యాగులో ల్యాప్‌టాప్, ఏటీఎం కార్డ్, ఆధార్ కార్డ్, మరికొన్ని సర్టిఫికెట్స్‌ను దాచుకుని నిద్రపోయింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో ఓ దొంగ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించాడు. బ్యాగును చోరి చేసి అక్కడి నుంచి ఉడాయించాడు.

Also read: Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

తెల్లారక చూసుకుంటే తన బ్యాగ్ కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఏపీ మంగళగిరికి చెందిన యువతి కె.మనస్వి (24) నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ మధురానగ‌ర్‌లోని రామిరెడ్డి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నివాసం ఉంటుంది. సోమవారం రాత్రి హాస్టల్లోని రూమ్‌లో మనస్వి గాఢనిద్రలో ఉన్నప్పుడు ఓ దొంగ జొరబడ్డాడు. ల్యాప్ టాప్, ఛార్జర్, విలువైన వస్తువులను బ్యాగులో దాచుకుంది. మనస్వి నిద్రలోకి జారుకున్నాక ఆమె రూమ్‌లోకి దొంగ జొరబడి బ్యాగును అపహరించి పరారయ్యాడు.రెండు హాస్టళ్లలో చోరి చేసి బ్యాగులతో దొంగ ఉడాయించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఓ లేడీస్ హాస్టల్లో వాచ్‌మెన్ లేకపోవడం.. మరో హాస్టల్లో వాచ్‌మెన్ ఉన్నా అతను నిద్రపోవడంతో దొంగకు అడ్డంకులు లేకుండా పోయాయి. లాభాపేక్షతో హాస్టళ్లను నిర్వహిస్తూ భద్రతను గాలికొదిలేశారని బాధిత యువతులు వాపోయారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లేడీస్ హాస్టల్లో దూరింది దొంగా లేదా ప్రియుడా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఎందుకంటే బయటకొచ్చిన సీసీ ఫుటేజ్‌ను చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. హాస్టల్ లోపలికి వచ్చే డోర్ కాస్తా ఓపెన్ చేసి ఉంది.సాధారణంగా డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. లేదా ఓపెన్ చేసి ఉంటుంది. కానీ హాస్టల్ డోర్ కొంచెం మాత్రం ఓపెన్ అయిన ఉండటం వీడియోలో చూడవచ్చు. అలాగే లోపలికి వచ్చిన వ్యక్తి కూడా తన ఫేస్‌కు ఎలాంటి మాస్క్ ధరించలేదు. సాధారణంగా దొంగతనం చేసే వ్యక్తి, తన ఫేస్ కనిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ ఇక్కడ అలాంటిది ఏదీ కూడా జరిగినట్టు కనిపించడం లేదు. పైగా అతను గోడ దూకి వెళ్లినప్పుడు అతని దగ్గర ఉన్న బ్యాగ్ కూడా అంత బరువుగా ఉన్నట్టు కనిపించలేదు. దీంతో వచ్చింది అసలు దొంగనే అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఉన్న యువతి కోసం సదరు వ్యక్తి వచ్చి ఉండవచ్చనే అభిప్రాయాన్ని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

 
Advertisment
Advertisment
Advertisment