ఆంధ్రప్రదేశ్ Vijayawada: విజయవాడలో 'మేకుల బాబా'.. భారీగా సొమ్ము కాజేసేందుకు స్కెచ్!! విజయవాడకు చెందిన సుంకర రజనీ అనే మహిళ మచిలీపట్నం, ఇనకుదురులో 14 సెంట్ల స్థలాన్ని రూ.35 లక్షల పెట్టి కొనుగోలు చేసింది. అయితే కొంత కాలం నుంచి ఈ స్థలాన్ని అమ్మేందుకు ఎంత ప్రయత్నించినా తిరిగి అమ్ముడు పోవడం లేదు. దీంతో రజనీ ఆందోళనకు గురైంది. అయితే తనకు సన్నిహితంగా ఉన్న ఒక మహిళతో ఈ సమస్యను పంచుకుంది. ఈమె అప్పుడు మేకుల బాబా గురించి చెప్పింది. దీంతో రజినీ నేరుగా అతన్ని కలిసి, స్థలం సమస్య చెప్పింది. ఇదే అదునుగా భావించిన దొంగ బాబా.. భారీగా సొమ్ము కాజేసేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. స్థలం అమ్ముడు పోవాలంటే స్థలంలో మేకులు కొట్టాలని చెప్పి రూ.2.5 లక్షలు తీసుకుని 4 మేకులు పాతాడు. ఇక రజినీకి నమ్మకం కుదిరేందుకు 100 గజాలు అమ్మించాడు. దీంతో ఆ దొంగ బాబా భయపెట్టడం మొదలు పెట్టాడు. స్థలం అమ్మిన తర్వాత నాలుగు లక్షలు కమీషన్ ఇవ్వకపోతే శాపం తగులుతుందని అన్నాడు. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By E. Chinni 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn