/rtv/media/media_files/2025/03/20/gmZ8MXWeCmuRu7Nb0lY4.jpg)
ఎంతమంది ఫేక్ బాబాలను పోలీసులు అరెస్ట్ చేసిన అమాయకపు జనాలు మాత్రం మారడం లేదు. పోలీసులు అవగాహాన కలిపించిన ఇంకా మోసపోతూనే ఉన్నారు. తాజాగా మరో ఫేక్ బాబాను అరెస్ట్ చేశారు పోలీసులు. మెదక్ జిల్లాలో ఫేక్ బాబా అలియాస్ బొమ్మెల బాపుస్వామి అరెస్ట్ ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెల బాపుస్వామి తనకు తానుగా శివస్వామి అంటూ మహిళలతో పరిచయం పెంచుకుంటాడు.
Also read : బెట్టింగ్ యాప్ ఉచ్చులో విజయ్ దేవరకొండ.. సంచలన విషయాలు బయటపెట్టిన పీఆర్ టీం!
ఇంట్లో ఏవైనా సమస్యలుంటే చిటికెలో తీర్చేస్తానని మహిళలకు నమ్మబలుకుతాడు. అతడి మాటలు నమ్మి మహిళలు పూజలకు సిద్దమయ్యాక.. తనలో కామాంధుడి రూపాన్ని బయటకు తీస్తాడు ఈ ఫేక్ బాబా. నిమ్మకాయలో మత్తుమందు, నీళ్ళల్లో నిద్రమాత్రలు వేసి మహిళలకు తాగిస్తాడు. మహిళలు ఆ నీళ్లు తాగాక స్పృహ కోల్పోయక వారిని అత్యాచారం చేసి వీడియో తీస్తాడు. తర్వాత కొన్ని రోజులకు మహిళలకు ఆ వీడియోలు పంపించి డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తాడు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వీడియో కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరింపులుకు పాల్పడుతాడు.
వందలాది మంది మహిళల నగ్న వీడియోలు
బాధలు తీర్చమని వెళ్లిన పలువురు మహిళలు అతని వలలో చిక్కి మోసపోయారు. ఇప్పటి వరకు బాధిత మహిళల నుంచి లక్షల రూపాయలు వసూళ్లు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి ఫోన్ లో వందలాది మంది మహిళల నగ్న వీడియోలు ఉన్నట్లుగా కనుగొన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నిందితుడి నుంచి తాయత్తులు, మత్తుమందు, రెండు సెల్ పోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. మంత్రలకు చింతకాయలు రాలవని, ఇలాంటి ఫేక్ బాబాలను నమ్మి మోసపోకూడదని సూచించారు.
Also read : ధనశ్రీ వర్మకు రూ. 4.75 కోట్లు భరణం.. ఇంతకీ చాహల్ ఆస్తులెంత?