Manmohan: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం
భారత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు సంతాప తెలియజేశారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని ప్రధాని మోదీ అన్నారు.
భారత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు సంతాప తెలియజేశారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని ప్రధాని మోదీ అన్నారు.
ఏపీ ఆర్టీసీ అధికారులు మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ పథకం అమలు చేస్తే రోజుకు సగటున 10 లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేశారు. అదనంగా 2వేల బస్సులు, 11,500 మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు.
శనివారం మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సీఎం జగన్, జనసేన నేత నాగబాబు ఎక్స్‌లో ట్వీట్లు చేశారు. అల్లుఅర్జున్ అభిమానులు సైతం ఆయనకు ఫ్లెక్సీలు కట్టారు.
రైతులకు ఫ్రీ-బస్ స్కీమ్ అమలుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఈ స్కీమ్ కు సంబంధించి విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘంను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో మందుబాబులు ఎగిరి గంతేసే వార్త చెప్పాయి కంపెనీలు.11 కంపెనీల వరకు మద్యం బేస్ ప్రైస్‌ను తగ్గించాయి. తగ్గించిన ధరలతో మందుబాబులకే పండగే అని చెప్పాలి. అంతేకాదు ఇటీవల కొన్ని కంపెనీలు కూడా మద్యం షాపుల్ని తగ్గించిన సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచిత భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు పౌష్టికాహార లోపం, మధ్యాహ్న భోజన సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ పథకం అమలు చేయనుంది.
AP: తమకు 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా చేస్తానని చెప్పి జగన్ ప్రజలకు తీరని అన్యాయం చేశారని షర్మిల ఫైరయ్యారు. విభజన హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి మోదీ, రెండో ముద్దాయి చంద్రబాబు, మూడో ముద్దాయి జగన్ అని విమర్శించారు.