/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
-
Dec 21, 2024 13:24 IST
రైతులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. మంత్రి కీలక ప్రకటన!
రైతులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందజేస్తామని తెలిపారు.
-
Dec 21, 2024 11:12 IST
రాష్ట్రంలో మరోసారి భూప్రకంపనలు.. వణికిపోతున్న ప్రజలు
ఏపీలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, ముండ్లమూరు, మారెళ్ల, తూర్పుకంభంపాడు, శంకరాపురం సహా పలుచోట్ల కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.
బ Photograph: (Earthquakes struck Prakasam district) -
Dec 21, 2024 10:55 IST
మెగా ఫ్యామిలీలో మళ్లీ చిచ్చు.. జగన్ ఫ్లెక్సీల్లో అల్లు అర్జున్ ఫొటోలు!
జగన్ పుట్టినరోజు బ్యానర్‌లో అల్లు అర్జున్ ఫోటో కలకలం రేపింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జగన్ ఫోటోతో పాటు అల్లు అర్జున్ ఫోటోను వైసీపీ క్యాడర్ ఏర్పాటు చేసింది. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ దగ్గరవుతున్న టైమ్‌లో వైసీపీ బ్యానర్లు హాట్ టాపిక్‌గా మారాయి.
-
Dec 21, 2024 10:07 IST
దారుణం.. క్రిస్మస్ వేడుకలలో టెర్రరిస్ట్ ఎటాక్.. 15 మంది మృతి!
జర్మనీలో క్రిస్మస్ వేడుకలకు ముందు టెర్రరిస్ట్ ఎటాక్ జరిగింది. మాగ్డెబర్గ్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా సౌదీ అరేబియాకి చెందిన డాక్టర్ తలీబ్ తన బీఎండబ్ల్యూ కారుతో జనాలపైకి దూసుకెళ్లాడు. 15 మంది మృతి చెందగా, వందమందికి పైగా గాయాలపాలయ్యారు.
https://rtvlive.com/international/german-christmas-market-car-crash-8544875
-
Dec 21, 2024 09:03 IST
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇనార్బిట్‌మాల్ ఎదురుగా ఉన్న సత్వభవనం ఐదంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.
-
Dec 21, 2024 09:03 IST
ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..10 మందికి తీవ్రగాయాలు
అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు తీవ్ర గాయాలపాలయ్యారు.పూర్తి వివరాలు కథనంలో.
-
Dec 21, 2024 09:01 IST
ఘనంగా ‘బిగ్ బాస్’ సోనియా పెళ్లి.. ఫొటోలు మస్తు ఉన్నాయ్
బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా ఆకుల పెళ్లి శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. యష్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. వీరి వివాహానికి బిగ్ బాస్ 8 కంటెస్టెంట్‌లతో పాటు గత సీజన్ కంటెస్టెంట్స్ హాజరై దీవించారు. ప్రస్తుతం పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
-
Dec 21, 2024 09:00 IST
నందిగం సురేష్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో దక్కని ఊరట!
వైసీపీ మాజీఎంపీ నందిగం సురేష్‌కు బిగ్‌షాక్ తగిలింది. దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేష్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.