తిరుపతిలో హోటల్స్ కు బాంబు బెదిరింపులు | Bomb Threats | RTV
Hotels in Tirupathi get Bomb Threats and Sources say that these threats are from Tamil Nadu Terrorists who are in support of Jaffer Sadiq who has been sentenced for Death.
Hotels in Tirupathi get Bomb Threats and Sources say that these threats are from Tamil Nadu Terrorists who are in support of Jaffer Sadiq who has been sentenced for Death.
తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేట్ హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్ కు గురువారం మెయిల్ లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఎయిర్ ఇండియాతో పాటు మరో మూడు ఎయిర్ లైన్స్‌కి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇటీవల దుబాయ్ నుంచి జైపూర్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కి బెదిరింపులు రాగా.. అధికారులు వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి తనిఖీలు నిర్వహించారు.
ముంబై నుంచి న్యూయార్క్ బయలు దేరిన AI-119 విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రత కారణాల దృష్ట్యా ఎయిర్ ఇండియా విమానాన్ని ఢిల్లీ అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలర్ట్ అయిన సెక్యూరిటీ బాంబ్ స్క్వాడ్ బృందంతో విమానంలో తనిఖీలు నిర్వహించారు.
విమానాశ్రయానికి కరెక్ట్ టైమ్ కి చేరుకోలేకపోయిన ఓ ప్రయాణికుడు ఎలాగైనా కాసేపు విమానాన్ని ఆపాలనుకున్నాడు. దీంతో విమానంలో బాంబు పెట్టానంటూ బెదిరించిన ఘటన మంగళవారం జరిగింది.
ముంబయి విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో తిరువనంతపురం విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలెర్ట్ ను ప్రకటించారు.
ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపుతున్నాయి. తాజాగా, గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించగా ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిపారు.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ - రాధిక మార్చంట్ల వివాహ వేడుకలో బాంబు పేలబోతుందంటూ ఓ దుండగుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడు గుజరాత్‌కు చెందిన ఓ ఇంజినీర్‌గా గుర్తించారు.
ఇండియాలోని 40 విమానాశ్రయాలను పేల్చేస్తామంటూ దుండగులు మెయిల్స్ పెట్టడం కలకలం రేపుతోంది. ఢిల్లీ, జైపూర్, పాట్నా, కోయంబత్తూర్, వడొదరా ఎయిర్‌పోర్టులను ద్వంసం చేస్తామంటూ మెయిల్స్ రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అన్ని ఎయిర్‌పోర్టుల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.