Bomb Threat : బాంబు బెదిరింపులు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

ముంబై నుంచి న్యూయార్క్ బయలు దేరిన AI-119 విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రత కారణాల దృష్ట్యా ఎయిర్ ఇండియా విమానాన్ని ఢిల్లీ అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలర్ట్ అయిన సెక్యూరిటీ బాంబ్ స్క్వాడ్ బృందంతో విమానంలో తనిఖీలు నిర్వహించారు.

New Update

Bomb Threat : ముంబై నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని భద్రత కారణాల దృష్ట్యా న్యూఢిల్లీకి మళ్లించారు. న్యూయార్క్‌లోని జేఎఫ్ కే విమానాశ్రయానికి AI-119 అనే విమానం ఈ రోజు తెల్లవారుజామున 2 గంటలకు ముంబై నుంచి బయలు దేరింది.

ఇది కూడా చూడండి: Villain Role : రాజమౌళి, రానా విలన్ కాంబో మళ్లీ రిపీట్ కానుందా?

బయలు దేరిన కొంత సమయానికే..

విమానం బయలు దేరిన కొంత సమయానికే బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే అప్రమత్తం అయ్యారు. ఎయిర్ ఇండియా విమానాన్ని  ఉదయం 4 గంటల 10 నిమిషాల సమయంలో ఢిల్లీలో అత్యవసరం ల్యాండింగ్ చేశారు. విమానంలో మొత్తం 293 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక్కడ ప్రయాణికులను సురక్షితంగా ఉంచి విమానంలో తనిఖీలు చేశారు.

ఇది కూడా చూడండి: నాగ వంశీకి షాక్.. సినిమా ఫ్లాప్ అయితే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా?

ఎయిర్‌పోర్ట్‌లోని ఐసోలేషన్ రన్‌వేపై ఎయిర్‌క్రాఫ్ట్ పార్క్ చేశారు. ఆ తర్వాత బాంబ్ స్క్వాడ్ బృందంతో పాటు భద్రతా సంస్థలు విమానంలో తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం విమానం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీలో ఉంది. ఒక్కసారిగా బాంబు బెదిరింపులు రావడంతో సెక్యూరిటీ అలర్ట్ అయ్యారు.

ఇది కూడా చూడండి: Trump : ట్రంప్‌ ర్యాలీకి సమీపంలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్‌

గత నెలలో కూడా ఇలానే బాంబు బెదిరింపులు రావడంతో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలోని వాష్‌రూమ్‌లో టిష్యూ పేపర్‌పై బాంబ్ ఇన్ ఫ్లైట్ అనే రాసి ఉన్న మేసేజ్‌ను గుర్తించారు. దీంతో సెక్యూరిటీ వెంటనే అలర్ట్ అయ్యి.. అత్యవసర ల్యాండింగ్ చేశారు. మళ్లీ నెల రోజుల్లో ఇలానే బాంబు బెదిరింపులు వచ్చాయి. 

ఇది కూడా చూడండి: పట్టాలు తప్పిన మరో రైలు.. 24 గంటల వ్యవధిలో మూడో ప్రమాదం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు