/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/RBI-jpg.webp)
ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటి వరకు విమానాలు, స్కూళ్లకు బెదిరింపులు రాగా.. తాజాగా ఆర్బీఐ గవర్నర్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. రిజ్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)ను పేల్చేస్తామంటూ గవర్నర్‌కు ఈ-మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు రష్యన్ భాషలో ఈ మెయిల్‌ను పంపించారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ-మెయిల్ ఎవరూ పంపారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇది కూడా చూడండి: Japan: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
గతంలో కూడా ఓసారి..
ఇదిలా ఉండగా ఇటీవల కూడా ఆర్బీఐ కస్టమర్ కేర్ నంబర్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. నవంబర్ 16వ తేదీన కూడా ఓ వ్యక్తి కాల్ చేసి లష్కరే-ఇ-తైబా సీఈఓ అని తెలిపారు. దానికంటే ముందు వారు ఫోన్‌లో పాట పాడారు. అయితే లష్కరే తోయిబా అనేది ఒక ఉగ్రవాద సంస్థ. ముంబైలో 2008లో దాడులను నిర్వహించింది. భారతదేశంలోని అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడులలో ఇది ఒకటి.
ఇది కూడా చూడండి: Hyderabad: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!
ఇది వరకు ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తి కాంత్ దాస్ ఉండేవారు. కానీ ఇటీవల సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ 26వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇలా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల తర్వాత ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో కాస్త ఆందోళన చెందుతున్నారు. ఆరేళ్లపాటు పదవిలో ఉన్న శక్తికాంత దాస్ స్థానంలో ఈయన నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి మల్హోత్రాను ఎంపిక చేసింది.
ఇది కూడా చూడండి: Allu Arjun: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్
ఇది కూడా చూడండి: TN: తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి
BIG BREAKING: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి కచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుందని ఎలాంటి సందేహం లేదన్నారు. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్ దాడి చేసే అవకాశం ఉందన్నారు.
Former- pakistan -high -commissioner -abdul- basit
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య టెన్షన్ వాతావరణ నెలకొంది. ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. అయితే తాజాగా పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి.
Also Read: సంచలన అప్‌డేట్.. 48 గంటల్లో పాకిస్తాన్‌పై యుద్ధం !
యూరీ దాడి తర్వాత 89లో భారత్ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు. అంతేకాదు సింధు జల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడం గురించి ఆయన మాట్లాడారు. పాకిస్థాన్ నీళ్లు లేకుండా మనుగడ సాగించడం కష్టమవుతుందని అన్నారు. దీనివల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని.. నదుల్లో నీరు ప్రవహించకపోతే రక్తం ప్రవహిస్తుందంటూ చెప్పుకొచ్చారు.
Also read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
ఇదిలాఉండగా ఇప్పటికే భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలో యుద్ధం జరుగుతుందో చెప్పలేం. అయితే తాజాగా ఓ కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. 48 గంటల్లో పాకిస్థాన్‌పై భారీ దాడి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్ మొసాద్ టీం దిగినట్లు తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ సాయం అందిస్తోందని.. పాకిస్థాన్‌లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఐరన్ డోమ్ టెక్నాలజీని సైతం భారత్‌కు అందిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించడంలో మొసాద్ టీం మంచి గుర్తింపు తెచ్చుకుంది.
telugu-news | Pahalgam attack
Vizianagaram : చెల్లికి ఆస్తిలో వాటా.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్ది గుద్ది చంపిన కొడుకు!
పెళ్లి లేదు.. గిల్లి లేదు... వెళ్లిపో.. వరుడికి షాక్ ఇచ్చిన ఆర్మీ
🔴India - Pakistan War Live Updates: ఏ క్షణమైనా భారత్ -పాకిస్థాన్ యుద్ధం లైవ్ అప్డేట్స్!
Pakistan: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
పాక్‌కు ఎగుమతులు ఆపేసిన భారత్.. భారీగా తగ్గనున్న వస్తువులు