Liquor: మందుబాబులకు గుడ్‌న్యూస్.. త్వరలో లిక్కర్‌ హోం డెలివరీ..

స్విగ్గీ, జొమాటో, బిగ్‌ బాస్కెట్‌ వంటి సంస్థలు మరికొన్ని రాష్ట్రాలకు త్వరలో లిక్కర్‌ను హోం డెలివరీ చేయనున్నాయి. వెస్ట్‌ బెంగాల్‌, ఒడిశాలో ఈ విధానం అమల్లో ఉండగా పంజాబ్, తమిళనాడు, గోవా, న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు నిర్వహించాలని యోచిస్తున్నాయి. 

New Update
Liquor: మందుబాబులకు గుడ్‌న్యూస్.. త్వరలో లిక్కర్‌ హోం డెలివరీ..

ప్రస్తుతం ఫుడ్‌ను డెలివరీ చేస్తున్న స్విగ్గీ, జొమాటో, బిగ్‌ బాస్కెట్‌ వంటి సంస్థలో త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో లిక్కర్‌ను డెలివరీ చేయనున్నాయి. బీర్, వైన్ లాంటి మద్యాన్ని హోమ్‌ డెలివరీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్, తమిళనాడు, గోవా, న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు నిర్వహించాలని యోచిస్తున్నాయి. అయితే మద్యం డెలివరీ చేయడం వల్ల లాభనష్టాలను అధికారులు అంచనా వేస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

Also read: 42 గంటల పాటు హాస్పిటల్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన రోగి.. అక్కడే మలమూత్రాలు చేసి!

ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో సంస్థల లిక్కర్‌ హోమ్‌ డెలివరీ విధానం.. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అమల్లో ఉంది. వాస్తవానికి 2020లో కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో ఛత్తీస్‌గఢ్, అస్సాం, ఝూర్ఖండ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు లిక్కర్‌ను హోమ్ డెలివరీ చేసేందుకు తాత్కలిక పర్మిషన్ ఇచ్చాయి. కానీ ఇప్పుడు కేవలం పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో మాత్రమే లిక్కర్ హోం డెలివరీ విధానం అమల్లో ఉంది. అంతేకాదు ఈ విధానం వల్ల ఈ రెండు రాష్ట్రాల్లో 20 నుంచి 30 శాతం మద్యం అమ్మకాలు పెరిగియాని అధికారులు చెబుతున్నారు.

ఇదిలాఉండగా.. గతంలో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఓ సర్వేలో 100 శాతం హైదరాబాద్‌ వాసులు లిక్కర్‌ను హోమ్ డెలివరీ చేసే విధానానికి అనుకూలంగా ఉన్నట్లు తేలింది. ఈ విధానం హైదరాబాద్‌లో ఎప్పుడు అమల్లోకి వస్తుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Also read: IAS పూజా ఖేద్కర్ శిక్షణను సస్పెండ్ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం!

Advertisment
Advertisment
తాజా కథనాలు