SuryaKumar: ముంబై టీమ్‌లో ఇంటర్నెల్‌ వార్‌? బుమ్రా, సూర్య పోస్టులు వైరల్‌!

ఐపీఎల్‌ 2024కు కెప్టెన్‌గా ముంబై హార్దిక్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం బుమ్రా, సూర్యకుమార్‌కు నచ్చలేదని వారి సోషల్‌మీడియా పోస్టులు చూసి అభిప్రాయపడతున్నారు ఫ్యాన్స్‌. సూర్యకుమార్‌ తాజాగా బ్రేక్‌ అప్ ఎమోజీ ట్వీట్ చేశాడు.

New Update
SuryaKumar: ముంబై టీమ్‌లో ఇంటర్నెల్‌ వార్‌? బుమ్రా, సూర్య పోస్టులు వైరల్‌!

Mumbai Indians: ముంబై జట్టుని ఫ్యాన్స్‌ ఒక టీమ్‌లా చూడరు.. ఒక కుటుంబంలా చూస్తారు. టీమ్‌ గెలిస్తే అందరూ ఆనందపడతారు.. ఓడితే అంతా బాధపడుతారు.. చెన్నై జట్టు అభిమానులు కూడా ఇలానే ఉంటారు. అయితే ఏ కుటుంబంలోనైనా గొడవలు కామన్‌ అని పెద్దలు చెప్పినట్లే.. ముంబై (MI), చెన్నై(CSK) జట్లలోనూ కలతలు వచ్చిన సందర్భాలున్నాయి. రైనా హొటల్‌ రూమ్‌ వ్యవహారంలో చెన్నై యాజమాన్యం ప్రవర్తించిన తీరు సూపర్‌ కింగ్స్‌ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసింది. మిస్టెర్‌ ఐపీఎల్‌గా గుర్తింపు తెచ్చుకున్న రైనాను వేలానికి వదిలేయడం.. తర్వాత కొనుగోలు చేయకపోవడం కూడా చెన్నై ఫ్యాన్స్‌కు నచ్చలేదు. ఆ తర్వాత జడేజాకు కెప్టెన్సీ ఇవ్వడం కూడా రుచించలేదు. ఇక ధోనీ (Dhoni) వర్సెస్‌ జడేజా ఇంటర్నెల్‌ ఫైట్‌ ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఇప్పటికీ ఈ ఇద్దరూ కలిసి లేరన్న ప్రచారం ఉంది. ఇక ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ముంబై టీమ్‌లో తాజాగా ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం అభిమానులనే కాదు.. ఆటగాళ్లను కూడా బాధపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.


బ్రేక్‌ అప్‌:
రోహిత్‌ (Rohit Sharma) వారసుడిగా గుజరాత్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న పాండ్యాను (Hardik Pandya) ఎంపిక చేయడం పట్ల ముంబై ఫ్యాన్స్‌ ఓవైపు బాధపడుతుండగా.. 360 డిగ్రీ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. లవ్‌ బ్రేక్‌ అప్‌ ఎమోజీతో సూర్య పోస్టు పెట్టాడు. ఇటీవలి జరిగిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సూర్య కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. రోహిత్‌ తర్వాత ముంబై కెప్టెన్సీ కూడా తనకే వస్తుందని సూర్య భావించి ఉండొచ్చని అయితే పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంతో సూర్య హర్టై ఇలా బ్రేక్‌ అప్‌ ఎమోజీతో స్టేటస్‌ పెట్టాడని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. అయితే ఈ పోస్టుకు కారణం అది కాదని.. సూర్యకుమార్‌ గాయపడ్డాడని మరికొందరు అంటున్నారు.

బుమ్రా ఫీల్ అయ్యాడా?
ఇక ముంబై ఇండియన్స్‌కు అత్యంత విధేయుడిగా ఉన్న జస్‌ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah) పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం విషయంలో బాధపడినట్టుగా ఫ్యాన్స్‌ చెప్పుకుంటున్నారు. గతంలో అతను చేసిన 'లోయల్‌' స్టేటస్‌లు దీని గురించేనని చెబుతున్నారు. సైలెన్స్‌ మేటర్స్‌ అంటూ కూడా ఇటీవలి బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్ట్ చేశారు. ఇక అందులోనూ పాండ్యా గతంలో పలుమార్లు ముంబై ఇండియన్స్‌కు కౌంటర్లు వేశాడు. అలాంటి పాండ్యాను మళ్లీ వెనక్కి పిలిచి కెప్టెన్సీ కట్టబెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదని బుమ్రా, సూర్య ఫీల్‌ అవుతున్నారని ఫ్యాన్స్‌ అంటున్నారు.

Also Read: ముంబై జెర్సీ తగలబెట్టిన రోహిత్‌ అభిమాని.. ట్విట్టర్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలు!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు