NASA: సునీతా విలియమ్స్ రాక వచ్చే ఏడాది‌‌–నాసా

80రోజులుగా అంతరిక్షంలో ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌‌లు ఇప్పుడప్పుడే రాలేరని తేల్చి చెప్పింది నాసా. వారు వచ్చే ఏడాది తిరుగు ప్రయాణమవుతారని నాసా అధికారికంగా ప్రకటించింది. స్పేస్‌ ఎక్స్‌కు చెందిన క్య్రూ డ్రాగన్‌లో వచ్చే ఫిబ్రవరిలో వస్తారని నాసా తెలిపింది.

New Update
అంతరిక్ష సంస్థలను ఎప్పుడు స్ధాపించారో తెలుసా..?

Sunitha Williams: ఎటకేలకు వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు ఎప్పుడు వస్తారనేది స్పష్టం చేసింది నాసా. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌లో గత జూన్‌ 5న భారత సంతతి ఆస్ట్రోనాట్‌ అయిన సునీతా విలియమ్స్‌, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. వీరిని తీసుకెళ్లిన స్టార్‌లైనర్‌ ప్రొపల్షన్‌తో సమస్యలు తలెత్తడంతో వారు 80 రోజులుగా అక్కడే ఉండిపోయారు. ఇప్పటి వరకు వ్యోమగాములు ఇద్దరూ ఎలా వస్తారో కూడా తెలియలేదు. అయితే తాజాగా నాసా ఒక ప్రకటన చేసింది. సునీతా విలయమ్స్, బచ్ లు వచ్చే డాది వస్తారని తెలిపింది. వారు వెళ్ళిన స్టార్ లైనర్ పాడైన కారణంగా అందులోనే మళ్ళీ తీసుకురావడం ప్రమాదకరమని చెప్పింది. వచ్చే ఏడాది ప్రారంభంలో మరో స్పేస్ షిప్‌ను అంతరిక్షంలోకి పంపించి..వారిద్దరినీ తీసుకువస్తామని నాసా చెప్పింది.

మరోవైపు వ్యోమగాములు ఆరోగ్యం మీద ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలుస్తోంది. వీరు మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉందని యూఎస్ మిలటరీ స్పేస్ సిస్టమ్ మాజీ కమాండర్ రుడీ రిడాల్ఫ్ చెబుతున్నారు. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సురక్షితంగా భూమి మీదకు రావాలంటే..సర్వీస్ మాడ్యూల్ సరిగ్గా అతుక్కోవాలని...క్యాప్సూల్‌ను సరైన కోణంలో అంటిపెట్టుకుంటేనే వారు సేఫ్‌గా భూమికి పైకి తిరిగి రాగలుగుతారని చెబుతున్నారు. మాడ్యూల్ కోణం ఏ మాత్రం సరిగ్గా లేకపోయినా రాపిడి జరిగి మంటలు పుడతాయని రుడీ చెప్పారు. దీనివలన ఆస్ట్రోనాట్స్ మాడి మసవుతారని అంటున్నారు. దీంతో సునీతా విలియమ్స్, బుచ్ ల సురక్షితత మీద మరిన్ని అనుమానాలు చెలరేగుతున్నాయి.

దాంతో పాటూ అంతరిక్షంలో గురుత్వాకర్షణ సున్నాగా ఉంటుంది. దీంతో  కండరాలకు ఎముకలకు బరువులు ఎత్తే పని ఉండదు. కాలక్రమేణా, కండరాల ఫైబర్స్ బలహీనపడతాయి. ఎముక కూడా బలహీనపడి విరిగిపోయే అవకాశం ఉంది. రోజంతా అంతరిక్షంలో ఉండడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి చూపు మసకబారుతుందని, డబుల్ విజన్ కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read: Amith Shah: 2026 నాటికి నక్సలిజం ఉండదు–‌‌ కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Woman Attack: షాకింగ్ వీడియో.. మహిళను పైకి లేపి నేలకేసి ఎలా కొట్టారో చూశారా?

సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. అందులో ఒక మహిళను మరో నలుగురు మహిళలు అతి దారుణంగా కొట్టడం చూడవచ్చు. జుట్టు పట్టుకుని, పిడుగుద్దులతో చితకబాదారు. ఆమెను పైకి లేపి నేలకేసి కొట్టారు. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.

New Update
viral news

viral news

Woman Attack: మహిళలు ఒక్కసారి గొడవ పడ్డారంటే.. అది పూర్తయ్యేవరకు విడిచి పెట్టరు. నడి రోడ్డుపై సైతం తన్నుకునేందుకు ముందుంటారు. జనాలు ఉన్నారని చూడరు. ఎవరుంటే తమకేమి అన్నట్లు ప్రవర్తిస్తారు. జుట్లు పట్టుకుని బాదుకుంటారు. బట్టలు చిరిగేలా కొట్టుకుంటారు. ఆ సమయంలో వారిని ఆపడం చాలా కష్టం. ఇప్పటి వరకు చాలానే అలాంటి సంఘటనలు చూశాం. తాజాగా మరొకటి జరిగింది. 

మహిళపై దాడి

ఒక మహిళ నడుచుకుంటూ తిన్నగా తన ఇంటికి వెళ్తుండగా.. వేరొక మహిళ ఆమె ముందుండి నడుచుకుంటూ వెళ్తుంది. అలా కొంత దూరం నడిచి వెళ్తుండగా.. సడెన్‌గా ఇంకొందరు మహిళలు వచ్చి ఆమెపై దాడి చేశారు. దాదాపు నాలుగురు లేదా ఐదురుగు మహిళలు కలిసి ఒక మహిళను అతి దారుణంగా చితకబాదారు. 

Also Read: ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆ మహిళను జుట్టు పట్టుకుని.. పిడి గుద్దులతో ఎంత గుద్దినా.. తిరిగి చేయి ఎత్తలేదు. దెబ్బలు కాస్తున్నా తిన్నగా ఇంటివైపు నడుచుకుంటూ వెళ్లిపోయింది. సరిగ్గా అప్పుడే ఒక అబ్బాయి వచ్చి ఆ మహిళను అమాంతంగా పైకి లేపి కిందికి విసిరేశాడు. అప్పుడు కూడా ఆ మహిళ ఏం అనకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

viral-video | viral-news | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment