Sunita Williams : నిలిచిపోయిన సునితా విలియమ్స్ రోదసి యాత్ర..

భారత సంతతికి చెందిన అమెకన్ ఆస్ట్రోనాట్ సునీత్ విలియమ్స్ రోదసి యాత్ర వాయిదా పడింది. వారు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్ లైనర్ అనే వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్‌లో సాకేంతిక లోపం తలెత్తింది. దీంతో రోదసి యాత్ర నిలిచిపోయింది.

New Update
Sunita Williams : నిలిచిపోయిన సునితా విలియమ్స్ రోదసి యాత్ర..

American Astronaut : భారత(India) సంతతికి చెందిన అమెకన్ ఆస్ట్రోనాట్ సునీత్ విలియమ్స్(Sunita Williams) రోదసి యాత్ర వాయిదా పడింది. వారు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్ లైనర్ అనే వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్‌లో సాకేంతిక లోపం తలెత్తింది. దీంతో రోదసి యాత్ర నిలిచిపోయింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు రాకెట్ లాంచ్(Rocket Launch) అవ్వాల్సి ఉంది. కానీ చివరి సమయంలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించడంతో వెంటనే దీన్ని ఆపేశారు. అప్పటికే వ్యోమనౌకలో ఉన్న సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం తమ మిషన్‌ను వాయిదా వేస్తున్నామని నాసా ప్రకటించింది. అయితే మళ్లీ ఎప్పుడు రోదసి యాత్ర చేపడతారనేది ఇంకా చెప్పలేదు.

Also Read: అన్ని రకాల కరోనా వైరస్‌లకు ఒకే వ్యాక్సిన్..

అయితే ఈ మిషన్‌ ద్వారా భూకక్ష్యలోని ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్ (ISS)లో వారం రోజుల పాటు బస చేయాలనేది ప్లాన్. స్టార్‌లైనర్ వ్యోమనౌకను తయారు చేసేటప్పుడు అనేక ఇబ్బందులు తలెత్తాయి. 2019లోనే ప్రయోగాత్మకంగా చేపట్టిన స్టార్‌లైనర్ తొలి యాత్ర ఐఎస్ఎస్‌ను చేరుకోలేకపోయింది. మరోసారి యాత్ర చేపట్టగా పారచూట్‌లో సమస్యలు వచ్చాయి. దీంతో చాలా ఏళ్ల పాటు ఆలస్యం జరిగింది. ఇప్పుడు సాంకేతిక లోపంతో మరోసారి ఆగిపోయింది. అయితే ఇది తర్వాతైనా సక్సెస్ అయితే.. ఐఎస్ఎస్‌కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వస్తుంది. స్పేస్ఎక్స్ వ్యోమనౌక ఇప్పుడు ఈ సేవలు అందిస్తోంది.

ఈ రోదసి యాత్రలో సునితా విలియమ్స్ మిషన్ పైలట్‌గా వ్యవహరించాల్సి ఉంది. ఇది ఆమెకు మూడో అంతరిక్ష యాత్ర. గతంలో కూడా 2006,2012లో ఆమె రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. గతంతో వెళ్లిన రోదసి యాత్రలో భగవద్గీతను తీసుకెళ్లిన సునితా.. ఈసారి తన ఆరాధ్య దైవం గణపతి విగ్రహాన్ని వెంట తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. కానీ ఈ మిషన్‌లో సాంకేతిక లోపం కారణంగా ఇది నిలిచిపోయింది. మళ్లీ ఈ రోదసి యాత్ర ఎప్పుడు చేపడుతారనేది తెలియాల్సి ఉంది.

Also Read: వరల్డ్ కప్‌ టోర్నీకి ఉగ్ర ముప్పు.. ఆ దేశం నుంచి బెదిరింపులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు