Earthquake: 7.4 రిక్టర్‌ స్కేల్‌ తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

తైవాన్‌ రాజధాని తైపీలో.. 7.4 రిక్టర్‌ స్కేల్‌ తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రభావానికి జపాన్‌ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ భూకంపానికి సంబంధించి ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
Earthquake: 7.4 రిక్టర్‌ స్కేల్‌ తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

తైవాన్ రాజధాని తైపీలో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.4గా రికార్డ్ అయ్యింది. అంతేకాదు తైవాన్‌తో భుకంప ప్రభావానికి జపాన్‌ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ఆ దేశ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక తైవాన్‌లో వచ్చిన భూకంప కేంద్రాన్ని.. దక్షిణ తైవాన్‌లోని హులియన్‌సిటీ సమీపంలో గుర్తించామని అమెరికాలోని జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంప ప్రభావానికి పలు భవనాలు కూడా కుప్పకూలాయి. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. తైవాన్‌లో గత 25 ఏళ్లలో ఇంత భారీ తీవ్రతతో భూకంపం రావడం ఇదే మొదటిసారి.

Also read: ఆరెంజ్‌ అలర్ట్‌లో తెలంగాణ.. అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment