Stock Markets:నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది అయినా స్టాక్ మార్కెట్లలో ఏమాత్రం ఉత్సాహం రాలేదు. నిన్న మొదటి రోజు మిక్స్‌డ్ ఫలితాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు ఈరోజు మాత్రం నష్టాలతోనే ముగిశాయి. నిఫ్టీ 21,700 స్థాయి దిగువకు పడిపోయింది. By Manogna alamuru 02 Jan 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Desi Markets:దేశీ మార్కెట్లు డీలా పడిపోయాయి. ఈరోజు ఉదయం మిక్స్‌డ్‌గా మొదలైన స్టాక్ మార్కెట్లు కొంతసేపు బాగానే ఉన్నట్టు అనిపించినా ఒకదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 71,682 కనిష్ట స్థాయికి పడిపోయింది. అది రోజు చివరకు వచ్చేసరికి 379.46 పాయింట్లు నష్టపోయి 71.892.48 దగ్గర ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 76.10 పాయింట్లు నష్టపోయి 21, 665.80 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పెరిగి 83.32గా ముగిసింది. కొత్త సంవత్సరం సందర్భంగా చాలా గ్లోబల్ మార్కెట్లు నిన్న సెలవు తీసుకోవడంతో, ఇండియన్ మార్కెట్లకు అంతర్జాతీయ సిగ్నల్స్ అందలేదు. పైగా ఆసియా మార్కెట్లు కూడా మిక్స్‌డ్‌గా ఉన్నాయి. కాబట్టి, ఈ రోజు ఓపెనింగ్ టైమ్‌లో మార్కెట్ల స్వల్ప లాభాలతో ప్రారంభమైనా, ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. Also Read:మళ్ళీ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన చిన్మయి..ఈసారి ఏకంగా సీఎం పైనే మార్కెట్ ఓపెనింగ్ టైమ్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 17 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ & నిఫ్టీలో... అల్ట్రాటెక్ సిమెంట్, HUL, ICICI బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. నెస్లే ఇండియా, భారతి ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కొంత లాభాల్లో ఉన్నాయి.అలాగే BSE మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు 0.3 శాతం వరకు లాభపడటంతో బ్రాడర్ మార్కెట్లు కాస్త మెరుగ్గా ఉన్నాయి. మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు తమ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ల కంటే ఔట్‌పెర్ఫార్మ్ చేశాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ దాదాపు 2 శాతం పెరిగి ఫుల్ జోష్‌లో కనిపించగా, ఇతర రంగాలు మాత్రం పత్తనడకులు నడిచాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియాల్టీ సూచీలు బాగా దెబ్బతిన్నాయి.క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (QIP) ద్వారా రూ.300 కోట్ల వరకు సేకరించేందుకు డైరెక్టర్ల బోర్డు నుంచి ఆమోదం లభించడంతో, జెన్సోల్ ఇంజనీరింగ్ స్టాక్ 2% లాభపడింది సెన్సెక్స్‌లో వోడాఫోన్ ఐడియా లిమిటెడ్, వోల్టాంప్ ట్రాన్స్‌ఫార్మర్స్, ఎన్ఎల్సీ ఇండియా ఫేర్లు నష్టాలు చవిచూశాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, సిప్లా ఫేర్లు లాభాలు ఆర్జించాయి. ఐషర్ మోటార్స్, ఎంఅండ్‌ఎం, ఎలంఅండ్టీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, కొటక్ మహీంద్రా షేర్లు మాత్రం దారుణంగా నష్టపోయాయి. మరోవైపు ఆసియా మార్కెట్ల పరిస్థితీ అలాగే ఉంది. ఈ ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. హాంగ్ సెంగ్, CSI 300 0.9 శాతం వరకు క్షీణించాయి. కోస్పి 0.07 శాతం పతనమైంది. ASX 200 0.22 శాతం పెరిగింది. జపాన్‌లో భారీ భూకంపం వల్ల సునామీ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి మార్కెట్లు మూతపడ్డాయి. జనవరి 01 కారణంగా నిన్న అమెరికన్ మార్కెట్లు సెలవు తీసుకున్నాయి. #shares #loss #stock-markets #desi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి