/rtv/media/media_files/2025/04/02/tWsSlHu3llkaQZ9i7o66.jpg)
Yashasvi Jaiswal resigns from Mumbai cricket association
MCA: భారత ఓపెనర్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో కొంతకాలంగా ముంబైకి ఆడుతున్న అతను గుడ్‌బై చెప్పేశాడు. ఈ మేరకు తాను గోవాకు మారాలనుకుంటున్నానని, దీనికి నిరభ్యంతరంగా పర్మిషన్ ఇవ్వాలంటూ ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు లేఖ పంపించాడు. అయితే జైస్వాల్ అభ్యర్థనను మేనేజ్ మెంట్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుండగా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే జైస్వాల్ నిర్ణయంపై ముంబై యాజమాన్యం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Yashasvi Jaiswal is set to quit playing domestic cricket for Mumbai and will turn out for Goa from the next season
— ESPNcricinfo (@ESPNcricinfo) April 2, 2025
Mumbai Cricket Association found it "surprising", but they've issued an NOC
🔗 https://t.co/oacj2QYifx pic.twitter.com/8jgZkeViu1
బలమైన కారణం ఉంది..
ఈ మేరకు జైస్వాల్ నిర్ణయం తమను ఆశ్చర్యపరిచిందని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు అన్నారు. జైస్వాల్ నిర్ణయం వెనక ఏదైనా బలమైన కారణం ఉందని భావిస్తున్నాం. అతడి రిక్వెస్ట్‌ను అంగీకరించి జట్టు నుంచి రిలీవ్ చేశామని చెప్పారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే తాను జట్టు మారుతున్నట్లు జైస్వాల్ తెలిపాడని, ఇకపై 2025-26 సీజన్ నుంచి గోవా తరఫున దేశవాళీ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు స్పష్టం చేశారు.
🚨 YASHASVI JAISWAL TO GOA 🚨
— Johns. (@CricCrazyJohns) April 2, 2025
- Jaiswal has written an Email to MCA seeking NOC to change his state team from Mumbai to Goa from next season. [Devendra Pandey From Express Sports] pic.twitter.com/vazJnjcPqy
ఇది కూడా చదవండి: విశాఖలో ప్రేమోన్మాది దాడి.. తల్లి కూతురిని చంపిన దుర్మార్గుడు
జైస్వాల్ రాకపై గోవా క్రికెట్ అసోసియేషన్ ఆనందం వ్యక్తం చేసింది. సెక్రటరీ శాంబ దేశాయ్.. జైస్వాల్‌ను తమ జట్టులోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని సమయంలో గోవాకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇక 2019లో ముంబై జట్టులో చేరిన జైస్వాల్.. అన్ని ఫార్మాట్లలో 63 మ్యాచ్‌లు ఆడాడు. రంజీల్లో 10, లిస్ట్ ఏలో 25, టీ20ల్లో 28 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. రంజీల్లో 863 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల దేశవాళీలో ముంబైని వీడిన మూడో ఆటగాడు జైస్వాల్. 2022-23 సీజన్ లో సచిన్ కుమారుడు అర్జున్, సిద్ధేశ్ లాడ్ కూడా ముంబైని వీడి గోవాకు మారిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: సోడా తాగడం వల్ల నిజంగా గ్యాస్ నయమవుతుందా?
yasawi-jaiswal | mumbai | goa | today telugu news