/rtv/media/media_files/2025/02/20/q9vc7jxYsVbX2jtzESjG.jpg)
Bangladesh Captain Najmul Hossain
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు తొలి పోరుకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈరోజు మధ్యాహ్నం ఇండియా, బంగ్లాదేశ్ రెండూ మొదటి మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు బంగ్లా జట్టు ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉంది. తమను తేలిగ్గా తీసుకోవద్దని...ఏ జట్టునైనా అలవోకగా జయించగలమని చెబుతోంది. దీనికి సంబంధించి నిన్న కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ నిన్న రోహిత్ సేనకు హెచ్చరికలు జారీ చేశాడు.
Also Read : అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్
Also Read : Rekha Gupta Net Worth : సొంత కారు కూడా లేదు .. ఢిల్లీ కొత్త సీఎం ఆస్తులెంత.. అప్పులెంత?
గతంలో చూసిన జట్టు కాదు..
బంగ్లాదేశ్ జట్టు ఇంతకు ముందులా లేదు. మీరు చూసిన బంగ్లా జట్టుకాదు ఇప్పుడు. గతంలో జట్టులో సరైన పేసర్లు లేక ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లాస్ట్ టూ ఇయర్స్ లో చాలా మంచి బౌలర్లు జట్టులోకి వచ్చారు. నహిద్ రాణా, తస్కిన్ అహ్మద్ ఇప్పుడు మా ప్రధాన పేసర్లు. వీళ్ళు సూపర్ ఫాస్ట్ గా బౌలింగ్ చేస్తున్నారు. ఇది జట్టుకు చాలా బలాన్ని ఇస్తుంది. ఇంకో సగం బ్యాటర్లు కష్టపడితే చాలు అని చెప్పుకొచ్చాడు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్. ముఖ్యంగా నహిద్ రాణా వేగం, ఖచ్చితత్వంతో ఆకట్టుకుంటున్నాడు. బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో అతని ప్రదర్శనలే.. అందుకు నిదర్శనం అని తెలిపాడు. ఈ టోర్నీలో ఎవరినైనా.. ఏ జట్టునైనా ఓడించగలమని మేము నమ్ముతున్నాము. ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే, మేం ఎవరినైనా ఓడించగలం అని రిపోర్టర్స్ మీటింగ్ లో మాట్లాడాడు నజ్ముల్.
Also Read: IND vs BAN : నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా మ్యాచ్.. అన్ని రికార్డుల్లో మనమే టాప్ !
Also Read : iPhone 16e: ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇదే ఛాన్స్.. 16 సిరీస్‌లో 16e మోడల్.. ధర ఇంత తక్కువా..!