Wasim Akram: ఆటలో అరటిపండు.. ఇమ్రాన్‌ ఖాన్‌ ఉంటే తన్నేవాడు: అక్రమ్‌ సంచలనం!

ఛాంపియన్స్‌ ట్రోఫీలో విఫలమైన పాక్ జట్టుపై వసీం అక్రమ్‌ సంచలన కామెంట్స్ చేశాడు. డ్రింక్స్ బ్రేక్ టైమ్‌లో ప్లేట్‌ నిండా అరటిపండ్లు తిన్నారని, కోతులు కూడా అన్ని తినలేవని విమర్శించారు. తాము అలా చేస్తే ఇమ్రాన్‌ ఖాన్‌ తన్నేవాడని చెప్పడం దుమారం రేపుతోంది. 

New Update
pak banana

pak banana Photograph: (pak banana)

Wasim Akram: ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఘోరంగా విఫలమైన పాకిస్థాన్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆ దేశ మాజీ క్రికెటర్లు రిజ్వాన్ టీమ్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆతిథ్యాన్ని సర్వనాశనం చేశారంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా పరువు తీశారంటూ తిడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మాజీ పాక్ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ సైతం ఆటగాళ్ల బద్ధకం గురించి సంచలన కామెంట్స్ చేశారు. గ్రౌండ్‌లో బొజ్జ నింపేందుకు రెడీగా ఉంటారు కానీ ఆడటం మాత్రం చేతకాదంటూ మండిపడ్డారు. 

వాళ్లు తిన్నట్లు కోతులు కూడా తినవు..

ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పాక్ ఓటమి గురించి మాట్లాడిన అక్రమ్.. 'ఛాంపియన్ ట్రోఫీలో ఓ మ్యాచ్ జరుగుతుండగా డ్రింక్స్‌ బ్రేక్‌ లో ఓ ప్లేట్‌ నిండా అరటిపండ్లు పాక్‌ ఆటగాళ్ల దగ్గరకు తీసుకెళ్లారు. వాళ్లు తిన్నట్లు కోతులు కూడా అన్ని తినవు. ఇమ్రాన్‌ ఖాన్‌ మా కెప్టెన్‌గా ఉంటే మమ్మల్ని తన్నేవాడు' అని చెప్పాడు. అయితే అక్రమ్ వ్యాఖ్యలపై రషీద్‌ లతీఫ్‌ ఘాటుగా స్పందించాడు. ప్రపంచకప్‌ గెలిచేందుకు 17 ఏళ్లు పట్టింది. 90ల్లోని పాక్‌ క్రికెటర్లు ఆటను వదిలిపెట్టలేదు. జట్టు, మేనేజ్‌మెంట్‌ నుంచి దూరంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. వారందరూ విశ్రాంతి తీసుకోవాలంటూ రియాక్ట్ అయ్యారు.

Also Read: పెళ్లైన రెండోరోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌లో వరుడు, అతని కుంటుంబం ఏం చేశారంటే!

పాక్ మాజీ స్టార్‌ ఆటగాడు అరటిపండ్లు ఎక్కువగా తినేవారిపై చర్యలు తీసుకోవాలని కోరడం తనకు ఆశ్చర్యమేసిందని భారత మాజీ క్రికెటర్‌ యోగ్‌రాజ్‌సింగ్‌ అన్నాడు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, తానే పాక్ ప్రధాన మంత్రిని అయితే అతడిని దేశం విడిచి వెళ్లమని ఆదేశిస్తానన్నారు. 

Also Read: ఇండియాపై ట్రంప్ విధించే టారిఫ్‌తో ఈ రంగాలు కుదేలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు