Third ODI: విజృంభించిన రోహిత్, విరాట్, యశ్వస్వి..రికార్డుల మోత

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో టీమ్ ఇండియా చితక్కొట్టింది. వన్డే సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్ లో సీనియర్లు రోహిత్, కోహ్లీ లతో పాటూ యశస్వి జైస్వాల్ కూడా రికార్డుల మోత మోగించాడు. 

New Update
third odi

దక్షిణాఫ్రికాతో టెస్ట్ లలో వాట్ వాష్ చేయించుకున్నా..వన్డే సీరీస్ లో మాత్రం తల వంచలేదు. సీనియర్లతో కలిసి కుర్రాళ్ళు సఫారీల పని పట్టారు. మూడు మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లు నెగ్గి సీరీస్ ను నెగ్గించుకున్నారు. వన్డే సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకుంది. నిన్న జరిగిన వైజాగ్ మ్యాచ్ లో రో-కోలతో పాటూ యశస్వి జైస్వాల్ కూడా విజృంభించేశాడు. రికార్డుల మోతతో హోరెత్తించారు. నిన్నటి మ్యాచ్ లో యశస్వి జైస్వాల్‌ (116 నాటౌట్‌; 121 బంతుల్లో 12×4, 2×6) సెంచరీ కొట్టి జైశ్వాల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. రోహిత్‌ (75; 73 బంతుల్లో 7×4, 3×6), కోహ్లి (65 నాటౌట్‌; 45 బంతుల్లో 6×4, 3×6) అర్ధశతకాలు చేశారు. 

20 వేల క్లబ్ లో రోహిత్..

వైజాగ్ లో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ 75 పరుగులు చేశాడు. దీంతో అతను అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. మొత్తం వరల్డ్ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన రోహిత్ 14వ బ్యాటర్ గా నిలిచాడు.  దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో కేశవ్‌ మహరాజ్‌ వేసిన 14వ ఓవర్లో నాలుగో బంతికి రోహిత్‌ సింగిల్‌ తీసి 20 వేల క్లబ్బులో అడుగు పెట్టాడు. దీంతో అతడి పరుగులు 20, 048కి చేరుకున్నాయి. వన్డేల్లో 11, 516 పరుగులు సాధించిన రోహిత్..టెస్టుల్లో 4301, టీ20ల్లో 4231 పరుగులు చేశాడు.

సచిన్ తర్వాత కోహ్లీనే..

దక్షిణాఫ్రికాతో వన్డే సీరీస్ లో ఉన్నవి మూడు మ్యాచ్ లే అయినా విరాట్ కోహ్లీ 302 పరుగులు చేశాడు. రెండు మ్యాచ్ లలో రెండు సెంచరీలు, ఒక దానిలో హాఫ్ సెంచరీ ఉన్నాయి. దీంతో కోహ్లీ సగటు 151 గా ఉంది. ఇదే కాక విరాట్ వన్డేల్లో 12వ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అందుకున్నాడు. ఈ లిస్ట్ లో జయసూర్య 11ను దాటుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. సచిన్ టెండూల్కర్ 15 ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ లతో మొదటి స్థానంలో ఉన్నాడు. 

మూడు ఫార్మాట్లలో..

ఇక యంగ్ క్రికెటర్ యశస్వీ జైశ్వాల్ ఈ మూడో వన్డేలో సెంచరీ చేసి అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే, టీ20, టెస్ట్‎ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన 7వ భారతీయ క్రికెటర్‎గా నిలిచాడు. రోహిత్, కోహ్లీల సరసన చేరాడు. 23 ఏళ్లలోనే వయస్సుల్లోనే జైశ్వాల్ ఈ ఘనత అందుకోవడం విశేషం. వైజాగ్ లో జరిగిన మూడో మ్యాచ్ లో ఈ యంగ్ క్రికెటర్ 111 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 

మూడు ఫార్మాట్లలో సెంచరీలు కొట్టిన ఇండియన్ బ్యాటర్స్:

1 సురేష్ రైనా
2 రోహిత్ శర్మ
3 కేఎల్ రాహుల్
4 విరాట్ కోహ్లీ
5 శుభమన్ గిల్
6 స్మృతి మంధాన( మహిళా క్రికెటర్)
7 యశస్వీ జైశ్వాల్

Advertisment
తాజా కథనాలు