/rtv/media/media_files/2025/01/28/GUib73YP5d9vajZuTpyo.jpg)
U19 Womens T20 World Cup Trisha Gongadi Create history
U19 Women World Cup: అండర్-19 మహిళల ప్రపంచకప్ టోర్నీలో భారత అమ్మాయిలకు అదరగొడుతున్నారు. సూపర్ సిక్స్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించగా తెలుగు యంగ్ క్రికెటర్ గొంగడి త్రిష ఆల్ రౌండ్ షోతో ఔరా అనిపించింది. త్రిష దెబ్బకు మహిళల టీ20ల్లో తొలి సెంచరీ నమోదైంది. బౌలింగ్‌లోనూ కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. 20 ఓవర్లలో 1వికెట్ నష్టానికి భారత్ 208 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్ సెమీస్ చేరుకోగా జనవరి 31న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
59 బంతుల్లోనే 110 పరుగులు..
ఇక తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష 59 బంతుల్లోనే 110 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. ఇందులో 13 ఫోర్లు, 4 సిక్స్‌లున్నాయి. అయితే త్రిష దెబ్బకు అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదవగా.. అండర్ 19 వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఓపెనర్లు త్రిష - కమలిని కలిసి తొలి వికెట్‌కు 147 పరుగులు చేశారు. కమలిని ఔటైనా సానికాతో కలిసి చివరి వరకూ క్రీజ్‌లో నిలిచిన త్రిష రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అంతేకాదు ఒక టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసి, 3 వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గానూ నిలిచింది.
మంత్రి దామోదర రాజనర్సింహ ప్రశంసలు..
అండర్ 19 వరల్డ్ కప్ లో అదరగొడుతున్న త్రిషపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రశసంలు కురిపించారు. ఈ మేరకు త్రిషను పొగుడుతూ పోస్ట్ పెట్టిన ఆయన.. 'Womens U-19 క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో మొట్టమొదటి సెంచరీని నమోదు చేసిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు అభినందనలు. ఆమె మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలని, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్లేయర్‌గా ఎదగాలని ఆకాంక్షింస్తున్నా. త్రిష సాధించిన సెంచరీ, క్రీడల్లో రాణించాలనుకుంటున్న ఎంతోమంది ఆడబిడ్డలకు స్పూర్తిగా నిలుస్తుంది' అని అన్నారు.
Womens U-19 క్రికెట్ కప్ చరిత్రలో మొట్టమొదటి సెంచరీని నమోదు చేసిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు.
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) January 28, 2025
ఆమె మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలని, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్లేయర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు.
త్రిష సాధించిన సెంచరీ, క్రీడల్లో… https://t.co/59ViPggz6M