/rtv/media/media_files/2024/11/16/in1xsUggONhGAntpPCHG.jpg)
రెండు మ్యాచ్ లు గెలిచి టీమ్ ఇండియా కుర్రాళ్ళ జట్టు మంచి ఉత్సాహంలో ఉన్నారు. ఈ రోజు జరిగే మూడో మ్యాచ్ లోనూ గెలిచి సీరీస్ కొట్టేయాలని చూస్తున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ ఇవాళ అయినా మ్యాచ్ గెలిచి ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తుంది. సిరీస్‌పై కన్నేసిన భారత్ వరుసగా మూడో విజయాన్నందుకుంటుందా? లేదా ఇంగ్లాండ్ పుంజుకుంటుందా?
సమిష్టిగా రాణిస్తున్న బ్యాటర్లు, బౌలర్లు..
భారత బ్యాటర్లు, బౌలర్లు విజృంభిస్తున్నారు. బ్యాటర్లలో అభిషేక్ శర్మ, తిలక్ వర్మలు లాస్ట్ రెండు మ్యాచ్ లలో అదరగొట్టారు. అలాగే బౌలర్లలో అర్షదీప్ మిగతా బౌలర్లు సరైన టైమ్ లో వికెట్లు తీస్తూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దానికి తోడు పేసర్ షమీ కూడా జట్టుకు యాడ్ అయ్యాడు. దీంతో జట్టుకు మరింత బలం చేకూరినట్టయింది. ఇదే జోరుతో ఈ రోజు రాజ్ కోట్ మ్యాచ్ లో కూడా గెలిస్తే ఇంకా రెండు మ్యాచ్ లు ఉండగానే సీరీస్ టీమ్ ఇండియా సొంతం అవుతుంది. మరోవైపు ఇంగ్లాండ్ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇది బలమైన జట్టే. ఎప్పుడైనా ఇది కమ్ బ్యాక్ అవ్వోచ్చు.
సూర్య కుమార్ సారధ్యంలో గత ఏడాది నుంచి టీ20 జట్టు మ్యాచ్ లను గెలుస్తోంది. అయితే సూర్య కెప్టెన్సీ బాగా చేస్తున్నారు కానీ బ్యాటర్ గా ఫెయిల్ అవుతున్నాడు. సూర్య 2024లో మొత్తంగా 17 ఇన్నింగ్స్‌ల్లో 26.81 సగటుతో 429 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరిగిన రెండు మ్యాచ్ లలో కూడా మొదటి మ్యాచ్ లో డక్ అవుట్ అయ్యాడు. రెండో దానిలో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే సంజూ శాంసన్ కూడా బ్యాట్ కు పని చెప్పాలి. ప్రతీ మ్యాచ్ లో ఒక్కరే ఆడాలంటే కష్టం అవుతుంది. అలా కాకుండా అందరు బ్యాటర్లు ఆడితే గెలవడానికి ఎక్కువ ఛాన్స్ లు ఉంటాయి.
రాజ్‌కోట్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించేదిగా ఉంది. పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్నర్లకు సహకారం లభిస్తుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటే మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రాజ్‌కోట్‌లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 189 పరుగులు. వికెట్లు కోల్పోకుండా ఉంటే.. ఇంతకన్నా ఎక్కువ పరుగులు కూడా రాబట్టవచ్చును.