/rtv/media/media_files/2025/03/22/nQeXHIOEQzFrm1gzGRNm.jpg)
Uppal Stadium, Hyderabad
ఈరోజు సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ అత్యంత పటిష్టమైన భద్రత మధ్య జరగనుంది. ఉప్పల్ స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్ ఉంటాయి. 450 సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పరిచారు. దీంతో పాటూ స్టేడియంలోకి ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, గొడుగులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టెలు, లైటర్లు, పదునైన వస్తువులు, బైనాక్యులర్లు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్లు, సెంట్స్, స్ప్రేలు, బ్యాగులు, బయటి ఆహార పదార్థాలను అనుమతించమని రాచకొండ సీపీ సుదీర్ బాబు చెప్పారు.
Also Read: USA: వర్కౌట్ అయిన ట్రంప్ ఐడియా..ఒక్కరోజులోనే 1,000 గోల్డ్ కార్డులు సేల్
అంతర్జాతీయ ప్రమాణాలతో..
ఉప్పల్ స్టేడియం అసలు పేరు రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం. దీన్ని 2003లో నిర్మించారు. ఈ గ్రౌండ్ మొత్తం 16 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఉప్పల్ స్టేడియంలో దాదాపు 55,000 మంది కూర్చుని మ్యాచ్ చూడొచ్చు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు హోమ్ గ్రౌండ్ ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని నిర్మించారు. స్టేడియంలో కార్పొరేట్ బాక్స్‌లు, ముఖ్యమంత్రి బాక్స్, వైఫైతో కూడిన విశాలమైన మీడియా గది ఉన్నాయి. అంతేకాదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ పేరుతో ఒక స్టాండ్ కూడా ఇక్కడ ఉంటుంది. దీన్ని 2019 డిసెంబర్ 6న ప్రారంభించారు. ఉప్పల్ స్టేడియం ఇప్పటి వరకు చాలా అంతర్జాతీయ మ్యాచ్ లకు వేదిక అయింది. టెస్ట్, వన్డే, టీ20...ఇలా అన్ని మ్యాచ్ లు ఇక్కడ అయ్యాయి. ఈ స్టేడియం 2017, 2019 ఐపీఎల్ ఫైనల్స్‌కు కూడా ఆతిథ్యం ఇచ్చింది.
today-latest-news-in-telugu | uppal-stadium | ipl-2025
Also Read: IPL 2025: ఇవాళ హైదరాబాద్ లో సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్