T20 : సెంచరతో అదరగొట్టిన తెలుగోడు తిలక్ వర్మ

సెంచూరియన్‌లో జరుగుతున్న భారత్ – సౌత్ ఆఫ్రికా మూడో టీ 20 మ్యాచ్‌లో తెలుగు అబ్బాయి తిలక్ వర్మ సెంచరీ తో అదరగొట్టాడు. దక్షిణా బౌలర్ల మీద విరుచుకుపడి పరుగుల వర్షం కురిపించాడు.దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.

author-image
By Manogna alamuru
New Update
11

సౌతాఫ్రికా vs భారత్:

తిలక్ వర్మ, అభిషేక్ వర్మ...దక్షిణా ఆప్రికా బౌలర్లను గడగడలాడించారు. ఒకరు సెంచరీతో, మరొకరు హాప్ సెంచరీతో పరుగుల వరద పారించారు. సెంచూరియన్‌ వేదికగా భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బరిలోకి దిగిన భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ సెంచరీతో దక్షిణాఫ్రికా బౌలర్లను చిత్తు చేశాడు. ఒకవైపు వరుస వికెట్లు పడిపోతున్న తాను మాత్రం సిక్సర్లతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మ్యాచ్ మొదలైన తర్వాత మొదటి ఓవర్ రెండో బంతికే సంజు శాంసన్ డకౌట్ అయ్యాడు.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ మొదటి నుంచే అటాకింగ్ గేమ్ మొదలు పెట్టాడు. ఇతనికి అభిషేక్ వర్మ కూడా తోడందించాడు.  వీరిద్దరూ రెండో వికెట్ కి 107 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు.  అభిషేక్ శర్మ 24 బంతులలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొన్న వెంటనే..తరువాతి బాల్ కే వెనురిగాడు. దీంతో తిలక్, అభిషేక్ పార్ట్నర్షిప్ కు బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్కరు తిలక్ వర్మకు పెద్దగా సపోర్ట్ అందించలేదు. అయినా కూడా తన సెంచురీని పూర్తి చేసుకున్నాడు తిలక్ వర్మ. దీంతో టీమిండియా...నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికాకు 220 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. 

Also Read: Movies: సూర్య కెరీర్‌‌లోనే అతి పెద్ద సినిమాగా కంగువ..విశేషాలివే..

తెలుగు రాష్ట్రాలకు చెందిన తిలక్ వర్మ తన టీ20 కెరియర్లో మొదటి సెంచరీని నమోదు చేశాడు. 51 బంతుల్లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. మొత్తానికి తిలక్ వర్మ 56 బంతులతో 107 పరుగులు చేశాడు. మరోవైపు వైపు దక్షిణాఫ్రికా బౌలర్లు.. అందిలే సిమెలనే, కేశవ్ మహారాజ్ లు చెరో రెండు వికెట్లు తీసుకోగా, మార్కో జాన్సెన్ ఒక వికెట్ ను తీసుకున్నాడు. తరువాత బ్యాటింగ్‌కు దిగిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. స్టేడియంలోకి  పురుగుల దండు దాడి చేయడంతో కాసేపు ఆటను నిలిపివేశారు. పురుగులను చెదరగొట్టాక మళ్ళీ ఆట మొదలైంది. 

Also Read:  MH:రాహుల్ బాబా విమానం మళ్ళీ కూలిపోతుంది–అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

Also Read: USA: విజయం తర్వాత మొదటిసారి వైట్ హౌస్‌కు ట్రంప్..బైడెన్‌తో భేటీ

Also Read: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH Highlights: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎన్నో ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. హీరో వెంకీమామ, ప్రీతి జింటా కలిసి నటించిన సినిమా నుంచి సాంగ్ వేస్తూ అలరించారు. ఇద్దరూ వేరే వేరు జట్లు కావడంతో సాంగ్ బాగా సింక్ అయింది. ఆ సాంగ్‌తో ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.

New Update
srh vs pbks match

srh vs pbks

ఇప్పుడంతా అభిషేక్ శర్మ పేరే వినిపిస్తోంది. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు పవర్ ఫుల్ మ్యూజిక్‌లతో ఉప్పల్‌ స్టేడియంలో షేక్ చేసిన అభిషేక్ శర్మ వీడియోలే కనిపిస్తున్నాయి. బాదుడు చూశాం.. కానీ వీరబాదుడు చూడటం నిన్ననే చూశామని క్రికెట్ ప్రియులు అంటున్నారు. అది విధ్వంశమా.. విస్పోటనమా?.. దానికి ఏ పేరు పెట్టాలో తెలియడం లేదని చెబుతున్నారు. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

ఆరెంజ్ ఆర్మీ అంటే ఎంటో అందరికీ మరోసారి తెలిసేలా చేశారు. బౌలర్ ఎవరైనా.. బాల్‌ని గ్రౌండ్ బయటకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అభిషేక్. కొడితే ఇలా కొట్టాలి.. ఆడితే ఇలా ఆడాలి అని అభిమానులు, ఆరెంజ్ ఆర్మీ ప్రియులు మాట్లాడుకునేలా చేశాడు. మొదటి మ్యాచ్ తప్పించి మిగతా మూడు మ్యాచ్‌లు పేవలమైన బ్యాటింగ్ చేసిన అభిషేక్.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 

Also Read: మరోసారి ఆగిపోయిన యూపీఐ సేవలు.. గందరగోళానికి గురవుతున్న వినియోగదారులు

ఎన్నో విచిత్రాలు

అయితే ఈ మ్యాచ్‌లో ఎన్నో విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా హీరో విక్టరీ వెంకటేష్ హైదరాబాద్ జట్టుకు పెద్ద ఫ్యాన్.. అలాగే పంజాబ్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ హీరోయిన్ ప్రీతీ జింటా. వీరిద్దరూ కలిసి గతంలో ప్రేమంటే ఇదేరా అనే సినిమా చేశారు. 

Also Read: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

ఇప్పుడు ఆ హీరో హీరోయిన్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. అదే సమయంలో వీరి సినిమా నుంచి ఓసాంగ్‌ను వేయగా.. స్టేడియం దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పాటు మరెన్నో జరిగాయి. అవి ఇప్పుడు చూసేయండి. 

SRH బౌలింగ్‌లో షమ్మీ వేసిన ఓవర్‌లో ఇషాన్ కిషన్ బాల్ పట్టి.. ఎలా తడబడ్డాడో చూడండి. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

అలాగే హైదరాబాద్ జట్టులో హెడ్ అండ్ అభిషేక్ వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదుతుండగా.. మాక్స్‌వెల్, ట్రివిస్ హెడ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ ఒకే దేశస్తులైన ఇలా గొడవ పడటంతో అంతా ఆశ్చర్యపోయారు.

IPL 2025 | srh-vs-pbks | abhishek-sharma | srh | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment