/rtv/media/media_files/2025/01/25/tZ2ssAUY3Pugm2sZRyOH.jpg)
Team India Cricketers at Maha Kumbh Mela 2025
ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. సామన్య ప్రజలతో సహా సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖు సైతం ఈ ఆధ్యాత్మిక వేడుకకు హాజరవుతున్నారు. ఇప్పటికి ఈ కుంభమేళాకు 10 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్ అతలాకుతలం.. వీడియో వైరల్!
ఈ కుంభమేళ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు హాజరవుతున్నారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్ భార్య సైతం ఈ ఆధ్యాత్మిక వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఈ కుంభమేళ వేడుకకు టీమిండియా క్రికెట్ జట్టు హాజరైనట్లు కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఇప్పట్లో లేనట్లే!
అయితే కొందరు మాత్రం ఆ ఫొటోలు చూసి నివ్వెరబోతున్నారు. క్రికెటర్లంతా ప్రస్తుతం మ్యాచ్‌లతో బిజీ బిజీగా ఉన్నారు కదా అంటున్నారు. కొందరు రంజీట్రోఫీలో, మరికొందరు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఈ గ్యాప్‌లో వారు కుంభమేళకు ఎలా వెళ్లారు అని ఆశ్చర్యపోతున్నారు.
కుంభమేళాలో టీమ్ ఇండియా
Also Read: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..
ఇక వైరల్ అవుతున్న ఫొటోల్లో ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యతో పాటు టీమిండియా ప్లేయర్లు కూడా కాషాయ దుస్తులు ధరించి ఉన్నారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. అవి ఒరిజినల్ ఫొటోలు కాదు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మాయాజాలం. అవును మీరు విన్నది నిజమే. అవి ఏఐ ఫొటోస్. నమ్మడానికి కష్టంగా ఉన్నా అదే నిజం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read: అమెరికాలోనే చరిత్రలోనే అతి పెద్ద ఏరివేత..వైట్ హౌస్