SRH: బాబోయ్ హైదరాబాద్ లో ఉండలేం..సన్ రైజర్స్ గగ్గోలు

 హైదరాబాద్ ఫ్రాంఛైజీ అయిన సన్ రైజర్స్ తమ నగరాన్నే వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటోంది. దీనికి కారణం ఇక్కడ ఉన్న హెచ్ సీఏ అని చెబుతోంది. ఐపీఎల్ ఉచిత పాస్ ల కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను హెచ్‌సీఏ తీవ్రంగా వేధిస్తుండడంతో నగరాన్నే వీడి వెళ్తామని అంటోంది. 

New Update
ACB Raids: HCAపై ఏసీబీ దాడులు

ఆట తప్ప మిగతా అన్ని విషయాల్లో ముందుంటుంది హైదరాబాద్ క్రికెట్ సంఘం. ఇప్పుడు అది మరో వివాదంలో చిక్కుకుంది. ఐపీఎల్ ఉచిత పాస్ ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ను హెచ్ సీఏ తీవ్రంగా వేధిస్తోందిట. ఈ బాధలు ఎస్ఆర్హెచ్ పడలేకపోతోంది. దీనికి తోడు కోరినన్ని పాస్ లు ఇవ్వలేదని ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తమకు కేటాయించిన కార్పొరేట్‌ బాక్స్‌కు హెచ్సీఏ తాళాలు కూడా వేసిందని సన్ రైజర్స్ చెబుతోంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ హెచ్‌సీఏ కోశాధికారికి సన్‌రైజర్స్‌ ప్రతినిధి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ బాధలు ఇక పడలేమని...అందుకే తాము హైదరాబాద్ ను వదిలి వెళ్ళిపోతామని  ఎస్ఆర్హెచ్ చెబుతోంది. 

బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..

హెచ్సీఏ చేస్తున్న బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ ల మీద  సన్ రైజర్స్ ఓ లేఖ రాసింది. దీనిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పన్నెండేళ్ళుగా హెచ్సీఏ కలిసి పని చేస్తున్నాం. కానీ లాస్ట్ రెండేళ్ళుగా చాలా వేధిస్తున్నారు. ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏకు 10 శాతం అంటే 3900 కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తున్నాం. 50 సీట్ల సామర్థ్యం ఉన్న ఎఫ్‌12ఏ కార్పొరేట్‌ బాక్స్‌ టికెట్లు కూడా అందులో ఉన్నాయి.  కానీ ఈ ఏడాది అది కాస్త తగ్గింది.  30 సీట్లే ఉన్నాయని...అదనంగా మరో 20 సీట్లు కావాలని అడిగారు. దీనిపై చర్చిద్దాం అని చెప్పాం. కానీ మాకు ఆలోచించుకునే టైమ్ కూడా ఇవ్వకుండా హెచ్సీఏ దారుణంగా ప్రవర్తించింది. స్టేడియానికి తామే అద్దె చెల్లిస్తున్నామని, కాబట్టి మొత్తం నియంత్రణ మా చేతిలోనే ఉంటుంది అంటోంది. కానీ గత మ్యాచ్‌ సందర్భంగా ఎఫ్‌-3 బాక్సుకు తాళాలు వేశారు. అదనంగా 20 టికెట్లు ఇస్తే తప్ప తెరవమంటూ బెదిరించారు. మ్యాచ్‌ ఆరంభానికి గంట ముందు వరకు దాన్ని తెరవలేదు అంటూ చెప్పుకొచ్చింది సన్ రైజర్స్ యాజమాన్యం. 

హెచ్సీఏ ఇలానే చేస్తే కలిసి పని చేయడం చాలా కష్టమని అంటోంది ఎస్ఆర్హెచ్. వాళ్ళు బెదిరించడం ఇదేమీ కొత్త కాదు. గత రెండేళ్లలో హెచ్‌సీఏ సిబ్బంది ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఈ ఏడాది హెచ్‌సీఏ అధ్యక్షుడు పలుమార్లు బెదిరించారు. దీన్ని సంఘం దృష్టికి తీసుకొచ్చాం కూడా. హెచ్‌సీఏ, ముఖ్యంగా సంఘం అధ్యక్షుడి ప్రవర్తనను బట్టి చూస్తే ఈ స్టేడియంలో సన్‌రైజర్స్‌ ఆడడం ఇష్టం లేనట్లుగా అనిపిస్తోందంటూ వాపోయింది.  వాళ్ళ ఉద్దేశం కనుక అదే అయితే బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, తమ యాజమాన్యంతో మాట్లాడి మరో వేదికకు మారిపోతామని అంటున్నారు సన్ రైజర్స్ మేనేజర్ శ్రీనాథ్. 

today-latest-news-in-telugu | hca | sunrisers

Also Read: Hyd: హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు