/rtv/media/media_files/2025/04/01/ttE5ma1BX9gkiNBTjaRO.jpg)
SRH VS HCU
తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఐపీఎల్ 2025 ఫ్రీ టికెట్ల కోసం HCA తమపై ఒత్తిడి చేస్తోందని SRH ఆరోపిస్తోంది. ఈ విషయంలో గత రెండేళ్లుగా బెదిరింపులకు గురిచేస్తోందని చెబుతోంది. మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా HCA ఫ్రీపాస్‌ల విషయంలో గొడవ చేసిందని ఆరోపించింది. దీనిపై సీఎం రేవంత్ కూడా సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు ఆయన ఆదేశించారు. ఫ్రీ టికెట్ల విషయంలో హెచ్‌సీఏ నుంచి బెదిరింపుల వస్తుండటంతో తీవ్ర ఆందోళన చెందినట్లు హెచ్‌సీఏ కోశాధికారికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధి శ్రీనాథ్ రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది.
వివాదం ఏంటంటే ?
తమిళనాడుకు చెందిన సన్‌నెట్‌వర్క్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి హైదరాబాద్‌ను తమ హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకొని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లో ఆడుతోంది. ఐపీఎల్ ఆడే సమయంలో ఉప్పల్ స్టేడియాన్ని రెంట్‌కు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రతీ మ్యాచ్‌కు హెచ్‌సీఏకు రూ.కోటి చెల్లిస్తోంది. మ్యాచ్ టికెట్ల విక్రయాలను కూడా సన్‌రైజర్స్ ఫ్రాంచైజీనే చూసుకుంటోంది. స్టేడియ కేపాసిటీ మొత్తం 39 వేలు. ఇందులో 10 శాతం అంటే 3900 టికెట్లను కాంప్లిమెంటరీ పాసుల రూపంలో SRH.. హెచ్‌సీఏకు ఫ్రీగా అందిస్తోంది.
Also Read: UPI సేవలు బంద్.. UPI సేవలు బంద్.. స్టేట్ బ్యాంక్ షాకింగ్ ప్రకటన!
బెదిరించారు
వీటిలో రూ.750 ధర టికెట్ల నుంచి రూ.20 వేలు విలువ చేసే కార్పొరేట్ బాక్స్ పాసులు కూడా ఉన్నాయి. ఈ కార్పొరేట్ బాక్స్ పాసుల విషయంలోనే సన్‌రైజర్స్‌కు, హెచ్‌సీఏకు మధ్య విభేదాలు వచ్చాయి. ఉప్పల్ స్టేడియంలోని సౌత్ స్టాండ్ ఫస్ట్‌ఫ్లోర్‌లోని ఎఫ్-12ఏ బాక్స్‌లో గత పదేళ్ల నుంచి హెచ్‌సీఏకు 50 టికెట్లు కేటాయిస్తోంది. అయితే ఈ సీజన్‌లో మాత్రం ఆ బాక్స్ కెపాసిటీ 30 టికెట్లు మాత్రమే. దీంతో అదనంగా మరో 20 టికెట్లు ఇవ్వాలని SRHను HCA అడిగగా.. దీనికి ఎస్‌ఆర్‌హెచ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎక్స్‌ట్రా టికెట్ల కోసం HCA బెదిరించిందని SRH ఆరోపిస్తోంది. గత రెండేళ్లుగా ఇలాంటి సమస్యలు కొనసాగుతున్నాయని, ఇక సహించలేమని SRH.. HCA ట్రెజరీకి మెయిల్ చేసిందన్న వార్తలు వచ్చాయి.
బ్లాక్ మెయిల్ చేశారు
SRH ప్రతినిధి శ్రీనాథ్ రాసిన లేఖలో ఏముందంటే.. '' 12 ఏళ్లుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాం. గత 2 సీజన్ల నుంచి మాకు వేధింపులు ఎదురవుతున్నాయి. ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏకు 10 శాతం (3900) కాంప్లిమెంటరీ టికెట్లు ఇస్తున్నాం. ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్‌లో 50 టికెట్ల సామర్థ్యం ఉంది. కానీ ఈ సీజన్‌లో మాత్రం దాని సామర్థ్యం 30 టికెట్లు మాత్రమే. కానీ అదనంగా మరో బాక్స్‌లో 20 టికెట్లు కేటాయించాలని హెచ్‌సీఏ అడిగింది. దీనిపై చర్చిద్దామని చెప్పాం. కానీ మార్చిన 27న లక్నోతో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఎఫ్3 బాక్సుకు తాళాలు వేశారు. అదనంగా 20 టికెట్లు ఇస్తే తప్ప తెరవమంటూ బెదిరించారు. మ్యాచ్ ఆరంభానికి గంట ముందు వరకు కూడా దాన్ని తెరవలేదు. మ్యాచ్ మొదలయ్యే సమయంలో ఇలా బ్లాక్ మెయిల్ చేయడం అన్యాయం. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయంతో కలిసి పనిచేయడం చాలా కష్టమని'' శ్రీనాథ్ లేఖలో రాసుకొచ్చారు.
Also Read: టీవీ నటితో హార్దిక్ పాండ్యా డేటింగ్.. బయటపడ్డ సంచలన వీడియో!
HCA వాదన ఏంటంటే ?
ఇదిలాఉండగా HCA వెర్షన్ మరోలా ఉంది. కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో తాము ఎవరినీ బెదిరించలేదని అంటోంది. SRH నుంచి తమకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటోంది. ప్రచారంలో ఉన్న లెటర్ కూడా ఫేక్ అని HCA వాదిస్తోంది. దీంతో అసలు SRH----- HCAకు లెటర్ పంపిదా..? లేక SRH దీన్ని బహిర్గతం చేసి HCAపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిందా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
అయితే చివరికీ ఈ పంచాయితీ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. SRH యాజమాన్యాన్ని HCA వేధింపులకు గురిచేస్తుందన్న ఆరోపణలపై ఆయన సీరియస్ అయ్యారు. ఫ్రీ పాసుల విషయంలో సన్ రైజర్స్‌ను ఇబ్బంది పెడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే HCAపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయితే HCAపై గతంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ బిల్లుల విషయంలోనూ HCA వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు SRHతో నెలకొన్న వివాదం నిజమని తేలితే రాబోయే రోజుల్లో HCA పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది.
rtv-news | IPL 2025 | sun-risers-hyderabad | HCA Ticket Issue | telugu-news