Rinku Singh: పెళ్లికి సిద్ధమైన క్రికెటర్.. యంగ్ ఎంపీతో త్వరలో వివాహం

భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ తరపున మచ్లిషహర్ లోక్‌సభ ఎంపీ అయిన ప్రియా సరోజ్‌తో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నాడు. యూపీకి చెందిన తుఫాని సరోజ్ కుమార్తె ఈ ప్రియా సరోజ్. ఈయన మూడు సార్లు ఎంపీగా గెలిచారు.

New Update
Rinku Singh

Rinku singh- Priya Saroj

Rinku Singh: భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఐపీఎల్‌లో(IPL) కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తరపున ఆడుతున్న రింకూ సింగ్.. మచ్లిషహర్ లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్‌(Lok Sabha MP Priya Saroj)తో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో పలువురు వీరికి విషెష్ తెలియజేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున 25 సంవత్సరాల వయస్సులోనే ఎంపీగా గెలిచినా అతి పిన్న వయస్కుల్లో ప్రియా సరోజ్ ఒకరు. 

ఇది కూడా చూడండి: ఖేల్ రత్న అవార్డ్‌లు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

ఇది కూడా చూడండి: Arvind Kejriwal: ప్రధానిమోదీకి కేజ్రీవాల్ సంచలన లేఖ.. ఏం చెప్పారంటే ?

సుప్రీం కోర్టు లాయర్‌గా కూడా..

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జన్మించిన ప్రియా సరోజ్ తుఫాని సరోజ్ కుమార్తె. అతను మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రియా న్యూఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీ కూడా పూర్తి చేశారు. ఆపై సుప్రీం కోర్టు లాయర్‌గా కూడా పనిచేశారు.

ఇది కూడా చూడండి:  సైఫ్ ను పొడిచిన కత్తి ఇదే.. ఎంత లోతు దిగిందంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు