/rtv/media/media_files/2025/03/06/KOgBv5LTT8ptTZSh5GMH.jpg)
Sachin Tendulkar half century against Australia in International Masters League T20
సాధారణంగా క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తమ పనుల్లో బిజీ బిజీగా ఉంటారు. కానీ కొందరు మాత్రం ఏదో ఒక లీగ్‌లో ఆడుతూ.. తమ ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటారు. అయితే సుమారు ఓ 40 ఏళ్లు పైబడిన తర్వాత మ్యాచ్ ఆడటం కాస్త కష్టంగా ఉంటుంది. ఆ ఏజ్‌లో పరుగులు పెట్టడం అనేది అత్యంత ప్రమాదకరం కూడా. కానీ కొందరు క్రికెటర్లు మాత్రం ఆ ఏజ్‌లో కూడా ఆడుతూ ఉంటారు. ఉదాహరణకు ఎంఎస్ ధోనీ లాంటివారు. కొందరు అరుదైన ప్లేయర్లు మాత్రమే తమ అభిమానుల కోసం ఆడుతూ ఎంటర్‌ట్రైన్ చేస్తారు.
ఇది కూడా చూడండి: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!
51 years young, but the shots still have the elegance of his prime! Sachin Tendulkar – a legend beyond time. pic.twitter.com/Lce3aHZgVU
— Out Of Context Cricket (@GemsOfCricket) March 6, 2025
52 ఏళ్ల వయస్సులో రప్పా రప్పా
అలాంటి లెజెండ్స్‌లో సచిన్ టెండూల్కర్ కూడా ఒకరు. 52 ఏళ్ల వయస్సులో కూడా సచిన్ ఇరక్కుమ్మేస్తున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో ఇదేం బాదుడు సామీ అన్నట్లు దుమ్ము దులిపేస్తున్నాడు. అవతల ఎలాంటి బౌలర్ అయినా అస్సలు తగ్గడం లేదు. స్టేడియంలో ఊచకోత కోస్తున్నాడు. బుల్లెట్ బైక్‌లా పరుగులు పెట్టిస్తున్నాడు.
Sachin Tendulkar status: Still got it ✅
— 7Cricket (@7Cricket) March 6, 2025
Enjoy him turning back the clock in the International Masters League! pic.twitter.com/enzOSknmKW
ఇది కూడా చూడండి: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!
ప్రస్తుతం ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 జరుగుతోంది. ఇది కేవలం రిటైరైన క్రికెటర్లతో నిర్వహించారు. ఈ టోర్నీలో సచిన్ అదరగొట్టేస్తున్నాడు. నిన్న (బుధవారం) ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సచిన్ ఇరక్కొట్టేశాడు. ధనాధన్ హాఫ్ సెంచరీతో మెరిసాడు. 33 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఇలా 194 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి ఔరా అనిపించాడు. అయితే ఆ మ్యాచ్‌లో ఒక్క సచిన్ తప్ప మరెవరూ పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోవడంతో భారత్ ఓటమిపాలైంది. ఆసీస్ నిర్ధేశించిన 269 పరుగులను ఛేధించలేక 174 పరుగులకే పరిమితమైంది.
ఇది కూడా చూడండి: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!
SACHIN TENDULKAR AT THE AGE OF 51 IN IMLT20 🥶 pic.twitter.com/PYvlKHMFFz
— Johns. (@CricCrazyJohns) March 5, 2025