MI VS GT: మళ్ళీ హిట్ మ్యాన్ సింగిల్ డిజిట్ కే అవుట్

హిట్ మ్యాన్ మళ్ళీ వరుసగా ఫెయిల్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలో సింగిల్ డిజిట్లకే అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. ఈరోజు కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు.  

New Update
ipl

Rohith Out

ఐపీఎల్ లో ఈరోజు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 8వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ప్రస్తుతం ముంబై బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ గా వచ్చిన రోహిత్ ఎనిమిది పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టి దూకుడుగా ఆడడం మొదలుపెట్టిన రోహిత్ తరువాత బాల్ కే అవుట్ అయిపోయాడు. తరువాత వచ్చిన తిలక్ వర్మ దూకుడుగా ఆడాడు. వరుసగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ చితక్కొడుతున్నాడు. అయితే అవతలి ఎండ్ లో ఉన్న రికెల్టన్ మాత్రం 6 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఇతని తర్వాత సూర్య కుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రగానే ఒక సిక్స్ బాదాడు. ప్రస్తుతం స్కోరు 48 పరుగులకు రెండు వికెట్లు. తిలక్ వర్మ 20, సూర్య 9 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. 

today-latest-news-in-telugu | ipl-2025 | rohith-sharma | mohammad-siraj 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు