/rtv/media/media_files/2025/02/28/Z0JvHgYU2cPSBOWwMJuB.jpg)
Rohit Sharma Skip India Champions Trophy Match Against New Zealand
పాకిస్తాన్ ఆతిథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఆడిన భారత్.. రెండు గెలుపొంది సెమిస్‌కు చేరుకుంది. ముందుగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ జరగగా.. టీమిండియా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం టీమిండియా గెలిపొందింది.
Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!
ఫస్ట్ మ్యాచ్‌తో రోహిత్ శర్మ, సెకండ్ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో ఇక ట్రోఫీ మనదేలే అని భారత్ క్రికెట్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ తరుణంలో బయటకు వచ్చిన ఓ న్యూస్ వారిలో ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ శర్మ తీవ్ర కండరాల నొప్పితో ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు స్పాట్ డెడ్!
నెక్స్ట్ మ్యాచ్‌కు దూరం
దీని కారణంగానే అతడు నెక్స్ట్ న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆదివారం భారత్ vs న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న రోహిత్ ఈ మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!
దీంతో రోహిత్ ఒకవేళ బెంచ్‌కి పరిమితం అయితే.. అతడి ప్లేస్‌లో రిషబ్ పంత్ లేదా వాషింగ్డన్ సుందర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిల్డింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ తొడ కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు.
Also Read: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఇక్కడి సీట్లు ఇక్కడివారికే
ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బాల్ కోసం పరుగెత్తిన రోహిత్ కాస్త అసౌకర్యంగా కనిపించాడు. అనంతరం అతడు గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లడంతో శుభమన్ గిల్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ రోహిత్ వచ్చి కెప్టెన్సీ కొనసాగించాడు. ఇక ఆ మ్యాచ్ అనంతరం ఈ రెండు రోజులు ప్రాక్టీస్‌లో టీమిండియా ఉండగా.. అందులో రోహిత్ కనిపించలేదు.