/rtv/media/media_files/2025/01/13/KS7dHFoCaT4B7hqprY5i.jpg)
Rohit sharma
Rohit sharma: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై మొత్తానికి ఓ క్లారిటీ వచ్చేసింది. సారథిగా, ఇటు బ్యాటర్ గా వరుసగా విఫలమవుతున్న హిట్ మ్యాన్ త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో మరో అంశం తెరపైకొచ్చింది. ఈ మేరకు రోహిత్ శర్మ సొంతగడ్డపైనే వీడ్కోలు పలకబోతున్నట్లు బీసీసీఐ పెద్దలకు హింట్ ఇచ్చేశాడట. త్వరలో జరగబోయే ఛాంపియన్ ట్రోఫీ, ఇంగ్లాడ్ తో సిరీస్ లకు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడట.
#NewProfilePic pic.twitter.com/aDJFxW8783
— Rohit Sharma (@ImRo45) July 8, 2024
కొన్ని నెలలు అని చెప్పలేను కానీ..
అంతేకాదు మరికొంత కాలం టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతానని బీసీసీఐకి చెప్పినట్లు సమాచారం. ఆస్ట్రేలియా పర్యటనపై బోర్డు నిర్వహించిన మీటింగ్ లో రోహిత్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడట. అయితే తాను కొన్ని నెలలు అని చెప్పలేను కానీ.. వీలైనంత త్వరగా కొత్త కెప్టెన్ ను చూసుకోవాలని సూచించింది నిజమేనని తెలుస్తోంది. దీంతో ఇంగ్లాండ్ తో 5 టెస్టుల ఆ సిరీస్‌లో రోహిత్ కెప్టెన్‌గా ఉంటాడు. ఆ సిరీస్ లేదా తర్వాత సొంతగడ్డపై అతను వీడ్కోలు పలకనున్నాడు.
🇮🇳, this is for 𝐘𝐎𝐔. pic.twitter.com/DSxE2gzgfw
— Rohit Sharma (@ImRo45) July 5, 2024
మరోవైపు రోహిత్ వారసుడిగా బుమ్రాను ఎంపిక చేసే విషయంలో బీసీసీఐ పెద్దలు ఆందోళన చెందుతున్నారట. బుమ్రా ఫిట్‌నెస్ రిత్యా కెప్టెన్ బాధ్యతలు ఇస్తే జట్టుకు ఇబ్బందులు ఎదురవుతాయని, ఇటీవలే వెన్ను నొప్పితో అతను అర్ధంతరంగా బౌలింగ్‌కు దూరం కావడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారట. పంత్ కు బాధ్యతలు అప్పగించాలని ప్లాన్ చేస్తున్నారట.