Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ వచ్చినా.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడతాడా? లేదా? అనే సందేహం చాలామందిలో ఉంది. అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎవరు ఆ బాధ్యతలు తీసుకుంటారనేది ప్రశ్న. దీంతో శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ పేర్లు వినిపిస్తున్నాయి.

New Update
Rohit Sharma Retirement after Who will be future ODI captain of Team India

Rohit Sharma Retirement after Who will be future ODI captain of Team India

Team India ODI Captain: ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో కీలక బ్యాటింగ్‌తో భారత్‌ను విజయవకాశాలవైపు తీసుకెళ్లాడు. ఇక ఈ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న అనంతరం రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై పలు వార్తలు జోరుగా సాగాయి. కానీ వాటన్నింటకీ రోహిత్ పుల్ స్టాప్ పెట్టాడు. 

Also Read :  పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!

తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయని.. అవాన్నీ అవాస్తవమని.. తాను 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆటడం కొనసాగిస్తానని తెలిపాడు. దీంతో తన రిటర్మెంట్‌పై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టినట్లయింది. అయితే, రోహిత్ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడతాడా? లేదా? అనే సందేహం ఇంకా చాలా మందిలో ఉంది. ఇలాంటి పరిస్థితిలో రోహిత్ తర్వాత వన్డేల్లో టీం ఇండియా కెప్టెన్ ఎవరు అనేది పెద్ద అందరిలోనూ ఒక ప్రశ్న తలెత్తింది.

Also read :  రంజాన్ ఎఫెక్ట్.. వాచిపోతున్న పండ్ల రేట్లు.. కిలో ఎంతంటే?

రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?

అయితే రోహిత్ రిటెర్మెంట్ తర్వాత వన్డేల్లో టీం ఇండియా కెప్టెన్‌గా కొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అందులో ముందు వరుసలో శుభమన్ గిల్ ఉన్నాడు. ప్రస్తుతం అతడు వన్డేల్లో వైస్ కెప్టెన్ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. అందువల్ల ఒకవేళ రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. జట్టు యాజమాన్యం గిల్‌ను భవిష్యత్ కెప్టెన్‌గా సెలెక్ట్ చేయనున్నట్లు కొందరు భావిస్తున్నారు. 

అందులోనూ గిల్ వన్డే క్రికెట్‌లో తన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. అలాగే మరో క్రికెటర్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. అతడే హార్ధిక్ పాండ్యా. ఈ పేరును కూడా సెలెక్టర్లు ఆలోచించే అవకాశం ఉంది. హార్దిక్ ఇంతకు ముందు కెప్టెన్‌గా పాత్ర పోషించాడు. ఆ అనుభవంతో అయినా.. అతడికి ఛాన్స్ ఇవ్వొచ్చని అంటున్నారు. అలాగే కేఎల్ రాహుల్ పేరు కూడా ఫ్యూచర్ కెప్టెన్‌గా వినిపిస్తున్న పేరు.

అతడు మొన్నటి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు బలమైన బ్యాటర్‌గా నిలిచాడు. టీమిండియా ఓడిపోతుందనుకున్న సమయంలో ఆదుకున్నాడు. అంతేకాకుండా రాహుల్ ఐపీఎల్‌లో కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. అందువల్ల అతడికి కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Advertisment
Advertisment
Advertisment