/rtv/media/media_files/2025/03/25/Gq0JcaojS3mfCvK1BSMV.jpg)
Rishabh Pant reason behind Lucknow defeat against Delhi in ipl 2025
13 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసిన జట్టు 209 పరుగులకే పరిమితమవుతుందని ఎవ్వరూ ఊహించలేరు. అదే విధంగా.. 7 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 66 పరుగులకే కష్టాల్లో పడ్డ జట్టు 210 పరుగులను ఛేదిస్తుందని అంతుకూడా చిక్కదు. దాన్నే ఐపీఎల్ మహాత్యం అంటారు.
IPL 2025లో భాగంగా నిన్న (సోమవారం) ఢిల్లీ క్యాపిటల్స్ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. చివరి నిమిషం వరకు ఏ జట్టు విన్ అవుతుందో తేల్చడం కష్టతరమైంది. బాల్ టు బాల్ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఏ బాల్‌కు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ.. ఒకవైపు గ్రౌండ్‌లో ఉన్న ప్లేయర్లలోనూ.. మరోవైపు గ్రౌండ్ బయట ఉన్న ప్రేక్షకుల్లోనూ కలిగింది.
ఒకానొక సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మ్యాచ్ గెలిచేస్తుందని అంతా భావించారు. ఢిల్లీ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతు వచ్చింది. స్టార్ బ్యాటర్లు అందరూ చేతులెత్తేశారు. దీంతో ఢిల్లీ జట్టు 7 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 66 పరుగులతో కష్టాల్లో పడింది. ఓటమి తథ్యం అని అంతా భావించారు. కానీ ఒకే ఒక్కడు లక్నో బౌలర్లకు చెమటలు పట్టించాడు.
అతడే అశుతోష్. తమ జట్టులో ఉన్న వారందరూ ఆశలు వదులుకున్నా.. అశుతోష్ మాత్రం ఆశలు కోల్పోలేదు. భారీ షాట్లతో పరుగులు రాబట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. చివరి వరకు ఉంటూ మ్యాచ్‌ను గెలిపించాడు. ఒక్క వికెట్ తేడాతో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. అయితే లక్నో ఓటమికి, ఢిల్లీ గెలుపుకి రిషబ్ పంతే కారణమని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
ఓటమికి కారణం పంత్
ఎందుకంటే ఢిల్లీ ఓటమికి ఒకే ఒక్క వికెట్ కావాల్సి ఉండగా.. దానిని రిషబ్ పంతే చేతులారా మిస్ చేశాడు అని అంటున్నారు. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టు.. మరో వికెట్ కోల్పోతే విజయం లక్నో సొంతం అయ్యేది. అదే సమయంలో ఢిల్లీ బ్యాటర్ మోహిత్ శర్మ బిగ్ షాట్ కొట్టేందుకు ఫ్రంట్‌కు వెల్లగా.. అది మిస్ అయి కీపింగ్ చేస్తున్న పంత్ చేతివైపు వచ్చింది. కానీ ఆ బాల్‌ను పట్టుకుని స్టంప్ చేయడంలో పంత్ విఫలమయ్యాడు.
#Sanjiv Goenka after #Rishabh Pant missed the stumping of Mohit Sharma when only 1 wicket was needed
— Praneeth (@Spy_W_o_r_l_d) March 24, 2025
Scored 6 ball Duck ( 27 cr )
Poor Captaincy by not complet spell of lord shardul
Ashutosh Sharma what a match🙇♂️#DCvLSG #TATAIPL #IPL2025#KLRahul pic.twitter.com/aZanKD2YlP
ఆ బాల్‌ని వదిలేయడంతో వికెట్ రాకుండా పోయింది. అదే లక్నో జట్టుకు మ్యాచ్‌ను కోల్పోయేలా చేసింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ధోనీలా సెకన్లలో స్టంప్స్ చేయాలనుకున్నాడని.. కానీ అలా జరగలేదని అంటున్నారు. అంతేకాకుండా పంత్ బ్యాటింగ్ అండ్ కెప్టెన్సీలో కూడా విఫలం అయ్యాడని ట్రోల్స్ చేస్తున్నారు. స్కోర్ భారీగా ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చి డకౌట్ అయ్యాడని.. అలాగే కెప్టెన్సీలో కూడా అతడు విఫలం అయ్యాడని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే తాను స్టంప్ చేయలేకపోవడానికి గల కారణాన్ని మ్యాచ్ అనంతరం పంత్ వివరించాడు. బ్యాటర్ మోహిత్ శర్మ ప్యాడ్స్‌కు తగలడం వల్ల స్టంపింగ్ చేయలేకపోయినట్లు తెలిపాడు.
(rishabh-pant | dc vs lsg | sports-news | ipl-2025 | latest-telugu-news | telugu-news)