/rtv/media/media_files/2025/03/03/VP6K4JeheEJslwlMIPgb.jpg)
Laureus World Sports Awards 2025
Laureus World Sports Awards 2025: టీమిండియా (Team India) స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishab Panth) కు అరుదైన ఘనత దక్కబోయే అవకావం కనిపిస్తోంది. అతడు తాజాగా ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. క్రీడా ప్రపంచంలోనే అతిపెద్ద అవార్డు అయిన లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకు అతడి పేరును పరిశీలిస్తున్నట్లు లారెస్ స్పోర్ట్ తాజాగా వెల్లడించింది. దీంతో ‘బెస్ట్ కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు విభాగంలో పంత్ నామినేట్ అయ్యాడు.
🎙️ The Nominees for the 2025 Laureus World Comeback of the Year Award are:
— Laureus (@LaureusSport) March 3, 2025
🇧🇷 Rebeca Andrade
🇺🇸 Caeleb Dressel
🇨🇭 Lara Gut-Behrami
🇪🇸 @marcmarquez93
🇮🇳 @RishabhPant17
🇦🇺 Ariarne Titmus
#Laureus25
ఈ విషయాన్ని తెలియజేస్తూ లారెస్ స్పోర్ట్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. అయితే ఇప్పటి వరకు కేవలం 1 క్రికెటర్‌కి మాత్రమే ఈ అవార్డు లభించింది. ఆ ఆటగాడు మరెవరో కాదు సచిన్ టెండూల్కర్. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఇప్పుడు రిషబ్ పంత్ లారస్ అవార్డుకు ఎంపికవ్వడం గమనార్హం.
RISHABH PANT NOMINATED FOR LAUREUS AWARDS 📢
— Johns. (@CricCrazyJohns) March 3, 2025
Pant has been nominated for the Laureus Comeback of the Year Award Category.
Pant is the only 2nd Cricketer to be nominated for the Laureus Award after Sachin Tendulkar - A proud moment for the country. 🇮🇳 pic.twitter.com/F4j9EFEBxo
#RishabhPant nominated in World Comeback of the Year category at Laureus Sports Awards. pic.twitter.com/bDqiiVaUw9
— Smriti Sharma (@SmritiSharma_) March 3, 2025
రిషబ్ పంత్ రియాక్షన్
దీనిపై రిషబ్ పంత్ తాజాగా స్పందించాడు. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకు తన పేరు నామినేట్ అవడం పట్ల పంత్ ఆనందం వ్యక్తం చేశాడు. ఆ దేవుడు మనకిచ్చిన వాటిపట్ల ఉంతో కృతజ్ఞతతో ఉండాలని తాను విశ్వసిస్తానని అన్నాడు. కారు ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లిన తాను ఆ దేవుడి దయ వల్లే బయటపడ్డానని గుర్తు చేసుకున్నాడు.
Also read : SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..
Rishabh Pant has been nominated for Laureus World Comeback of the Year Award ❤️🧿 #RishabhPant pic.twitter.com/HHS9QJZ1qt
— Amlesh (@amlesh_17) March 3, 2025
ఇక ఆ తర్వాత నుంచి తనలో చాలా కసి పెరిగిందని అన్నాడు. తనలో మార్పులు వచ్చాయని.. గ్రౌండ్‌లో పరుగులు వరద పారించాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టానని.. టీమిండియాకు మళ్లీ ఆడాలనే కలను నెరవేర్చుకున్నానని తెలిపాడు.
A well-deserved Laureus nomination for @RishabhPant17 🙌 #rishabhpant #laureus #bharatarmy #coti🇮🇳 #teamindia pic.twitter.com/RzesB70mry
— The Bharat Army (@thebharatarmy) March 3, 2025
Also Read : టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ఇందులో టీమిండియా తరఫున పంత్ 11వ ప్లేయర్‌గా కూడా ఆడే ఛాన్స్ లేకపోయింది. దీంతో బెంచ్‌పై కూర్చుని కనిపిస్తున్నాడు. పంత్ ఖచ్చితంగా ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ ఇండియాలో భాగమే, అయినా అతనికి ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశచెందుతున్నారు. ఇంతలో అతడు ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అవడంతో రిషబ్ పంత్‌తో పాటు మొత్తం క్రికెట్ ప్రపంచానికి చాలా శుభవార్త వచ్చింది. ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా పంత్ నిలిచాడు.