/rtv/media/media_files/2025/03/22/9qZEmJRkaF0YjaVY62BL.jpg)
rcb won the match
ఐపీఎల్ 2025లో ఈరోజు కోలకత్తాలో కేకేఆర్, ఆర్సీబీల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. మొదట వర్షం పడుతుందేమో మ్యాచ్ అవదేమో అనుకున్నారు. కానీ వరుణిడి దయ వలన మ్యాచ్ సవ్యంగా జరిగింది. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ను వారి సొంతగడ్డపై 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు 16.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 పరుగుల కొట్టి నాటౌట్ గా నిలిచాడు. ఫిల్ సాల్ట్ 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56 పరుగులు చేయగా..కెప్టెన్ రజత్ పటీదార్ 16 బంతుల్లో 34 పరుగులు చేసి రాణించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్..
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బ్యాటింగ్ కేకేఆర్ కు ఇచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లకు గానూ 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా టీమ్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ గా వచ్చిన క్వింటన్ డికాక్(4) పరుగులకే వెనుదిరిగాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అయిదో బంతికి వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఆ తరువాత సునీల్ నరైన్‌తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు కెప్టెన్ అజింక్య రహానే. మూడు ఓవర్లకు 9 పరుగులు చేసిన కేకేఆర్ టీమ్ ఆ తరువాత ఆరు ఓవర్లలో ఏకంగా 90 పరుగులు బాదింది. వరుస ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఆర్సీబీ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు వీరిద్దరూ. ఈ క్రమంలోనే 25 బంతుల్లో రహానే హాఫ్ సెంచరీ చేశాడు. పది ఓవర్లు పూర్తి అయ్యేసరికి కేకేఆర్ 100 పరగులు మార్క్ దాటింది. దీంతో స్కోరు 200పైగాపనే వెళ్తుందని అంతా భావించారు. ఇంతలోనే ఆర్సీబీ బౌలర్లు పుంజుకున్నారు. వరుస వికెట్లతో కేకేఆర్ వికెట్ల పతనాన్ని శాసించారు. రహానే, సునీల్ నరైన్ అందించిన జోష్ ను మిడిలార్డర్ ఆటగాళ్లు కొనసాగించలేకపోయారు. రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ లాంటి హిట్టర్స్ కూడా త్వరత్వరగానే ఔటయ్యారు. లేదంటే కేకేఆర్ భారీ స్కోర్ చేసేదనే చెప్పాలి.
లక్ష్య ఛేదనలో ఆర్సీబీ దూకుడు..
కేకేఆర్ చ్చిన టార్గెట్ ఛేదనకు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు మొదట నుంచి దూకుడుగా ఆడుతూ కేకేఆర్ బౌలర్స్ చెమటలు పట్టించారు. ఓపెనర్లుగా దిగిన విరాట్ కోహ్లీ, సాల్ట్ లు వికెట్ కోల్పోకుండా చాలా సేపు నిలకడగా ఆడారు. ఈక్రమంలో సాల్ట్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విరాట్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. కేకేఆర్ బౌలర్లను ఇద్దరు బ్యాటార్లు చితక్కొట్టారు.
సీనియర్ గా కింగ్ కోహ్లీ ఆర్సీబీ బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నాడు. బ్యటింగ్ కు దిగిన దగ్గర నుంచి బాగా ఆడుతూ మ్యాచ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ లో ఈరోజు మొదటి మ్యాచ్ కేకేఆర్, ఆర్సీబీల మధ్య అవుతోంది. ఇందులో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసి 174 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీకి ఇచ్చింది. దీన్ని ఈజీగానే ఛేదిస్తోంది బెంగళూరు జట్టు. ఓపెనర్లుగా వచ్చిన కోహ్లీ, సాల్ట్ లు నిలకడగా ఆడారు. సాల్ట్ 56 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. విరాట్ మాత్రం ఇంకా ఆడుతున్నాడు. ఈక్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివర వరకు ఉండి మ్యాచ్ విన్నింగ్ లో కీలక పాత్ర పోషించాడు కింగ్ కోహ్లీ.
today-latest-news-in-telugu | ipl-2025 | rcb | kkr