/rtv/media/media_files/2025/03/21/Hv6BLgjhcVXg9woN6MKp.jpg)
Ravichandran Ashwin
భారత మాజీ క్రికెటర్, స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ డిసెంబర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో మెరవనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరాడు. అతడు 2009 నుండి 2015 వరకు CSK జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత జట్టుతో విడిపోవడంతో ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గుడ్ బై చెప్పిన తర్వాత అతడు రాజస్థాన్ రాయల్స్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. 2022 నుండి 2024 వరకు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక గతేడాది ఐపీఎల్ వేలంతో మళ్లీ CSKకి తిరిగి వచ్చాడు. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టు తమ IPL 2025లో తొలి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో తలపడటానికి సిద్ధంగా ఉంది. మార్చి 23న చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!
వీధికి అశ్విన్ పేరు
ఇదిలా ఉంటే అశ్విన్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చెన్నైలో ఒక వీధికి రవిచంద్రన్ అశ్విన్ తన పేరు పెట్టబోతున్నాడు. ఓ నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జిసిసి).. పశ్చిమ మాంబళంలోని రామకృష్ణపురం 1వ వీధి పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంది.
Also Read : లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
అశ్విన్ యాజమాన్యంలోని క్యారమ్ బాల్ ఈవెంట్ అండ్ మార్కెటింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రతిపాదనను సమర్పించిందని ఓ నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగానే వారు స్థానికంగా ఉన్న ఆర్య గౌడ రోడ్డు లేదా రామకృష్ణపురం 1వ వీధి పేరు మార్చాలని కోరారు.
అయితే ఇలా ప్రముఖ క్రికెటర్లు తమ పేరును సమీప రోడ్లకు పెట్టుకోవడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో చాలా మంది క్రికెటర్లు తమ పేరు మీద ఒక రోడ్డు పెట్టుకున్నారు. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేరు మీద వెల్లింగ్టన్, తంజావూర్, కాసర్గోడ్‌లో మూడు రోడ్లు ఉన్నాయి. కపిల్ దేవ్ వెల్లింగ్టన్‌లో కూడా ఒకటి ఉంది. క్వీన్స్‌ల్యాండ్‌లో గ్రెగ్ చాపెల్ పేరు మీద ఒక వీధి ఉంది.