Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొద్ది రోజులుగా పేవలమైన ఆటతీరు కనబరుస్తున్నాడు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా పెద్దగా రాణించలేకపోయాడు. మూడు, నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. ఆరో స్థానంలో క్రీజ్‌లోకి దిగిన రోహిత్ ఫామ్‌లో లేక ఇబ్బందులు పడ్డాడు. దీంతో ఎన్నో విమర్శలకు, ట్రోలింగ్‌లకు గురయ్యాడు.
Also Read : నాలుగో రోజు కంటిన్యూ .. దిల్ రాజు ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు
కేవలం 3 పరుగులకే ఔట్
ఇక ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో అయినా.. అందరి నోళ్లు మూయించాలని, మునుపటి జోరు అందుకోవాలని అనుకుంటున్నాడు. నిన్న (గురువారం) జమ్మూకశ్మీర్ - ముంబై మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై తరఫున ఆడిన రోహిత్ మళ్లీ అదే తప్పు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులకే ఔటయ్యాడు.
Also Read : ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!
Well done buddy! Umar Nazir, the Pulwama boy who stole the show against Mumbai. Claimed prized scalp of Indian captain Rohit Sharma among others.
— Arsheed Ahmad (@SpeaksArsheed) January 23, 2025
pic.twitter.com/TUZpLypOZJ
Also Read : భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!
పేసర్ ఉమర్ నజీర్ హడల్
జమ్మూ కశ్మీర్ టీమ్‌కు చెందిన 31 ఏళ్ల పేసర్ ఉమర్ నజీర్ మిర్.. రోహిత్ శర్మ వికెట్‌ను పడగొట్టాడు. అతడితో పాటు టాప్ బ్యాటర్ల వికెట్లను తీశాడు. తన స్పెల్‌లో రోహిత్, అజింక్య రహానె, శివమ్ దూబె, హార్తిక్ టామోర్ వంటి బడా బ్యాటర్లను వెనక్కి పంపాడు. దీంతో ఒక్క సారిగా వార్తల్లో నిలిచాడు.
Also Read : నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్ బంపరాఫర్!
అయితే రోహిత్ శర్మ వికెట్ తీసిన తర్వాత పేసర్ ఉమర్ నజీర్ ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. దానికి గల కారణాన్ని సైతం అతడు వెల్లడించాడు. టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ అంటే తనకు చాలా గౌరవమని అన్నాడు. తాను రోహిత్‌కు వీరాభిమానిని అని చెప్పుకొచ్చాడు. అందువల్లనే రోహిత్ వికెట్‌ను సెలబ్రేట్ చేసుకోలేదన్నాడు. ఆ మ్యాచ్‌లో తాము గెలిస్తే అది ఎంతో గర్వించదగ్గ విషయమని తెలిపాడు. రోహిత్ శర్మ కీలకమైనదని.. అతడిని ఔట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఉమర్ నజీర్ చెప్పుకొచ్చాడు.