/rtv/media/media_files/2025/03/23/VjWcqJXQnIAcnVWdOnsH.jpg)
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో ఘోర ఓటమిని చవిచూసింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ అఘా సల్మాన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అల్లెన్ 20 బంతుల్లో 50 పరుగులు చేయగా, టిమ్ సీఫెర్ట్ 22 బంతుల్లో 44 పరుగులు చేశాడు. వీరితో పాటు, బ్రేస్‌వెల్ 26 బంతుల్లో 46* పరుగులు చేయడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది.
Also Read : ''బాలీవుడ్ లో అహం ఎక్కువ''.. అల్లు అర్జున్ మాత్రమే ఆపని చేశాడు: గణేష్ ఆచార్య
Logic🫣
— Bilal Awan (@BilalAw64518854) March 23, 2025
Last game
16 overs 207..
Ganda khehlty hain ..
Phir justify bhi krty hain#PakistanCricket #PAKvNZ #NZvsPAK https://t.co/Mr40QPgbRn
Also Read : భారీ లాభాల్లో తెలంగాణ ఆర్టీసీ.. రూ.1,008.79 కోట్ల ఆదాయం!
న్యూజిలాండ్‌కు రెండవ అతిపెద్ద విజయం
అనంతరం బ్యాటింగ్ చేసిన పాక్ కేవలం 105 పరుగులకే తోకముడించింది. పవర్ ప్లేలోనే పాకిస్తాన్ జట్టులో సగం మంది ఆటగాళ్లు పెవిలియన్‌కు బాట పట్టారు. పాక్ ఆటగాళ్లలో ఇర్ఫాన్ ఖాన్ మాత్రమే 24 పరుగులు చేశాడు. జాకబ్ డఫీ 4-, జాక్ ఫౌల్క్స్ 3 వికెట్లతో పాక్ ఇన్సింగ్స్ ను శాసించారు. దీంతో 110 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది కివీస్ జట్టు. ఇది న్యూజిలాండ్‌కు రెండవ అతిపెద్ద టీ20 విజయం, 2018లో అదే బే ఓవల్ వేదికగా వెస్టిండీస్‌పై 119 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ విజయంతో పాకిస్థాన్ పై ఐదు మ్యాచ్‌ల సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. ఐదవ టీ20బుధవారం వెల్లింగ్టన్‌లో జరుగనుంది. కాగా ఇప్పటికే సోంత గడ్డపై నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ దశలోనే ఇంటిముఖం పట్టిన పాక్.. ఇప్పుడు మరో సిరీస్ కోల్పోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఆటగాళ్లు, కెప్టెన్లు మారిన పాక్ ఆటతీరు మారడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read : అతనికోసం నన్ను టార్చర్ చేశారు.. నాలుగేళ్లు నరకం చూశా: రియా ఎమోషనల్!
Also Read : అబుదాబి స్వామి నారాయణ్ మందిర్ లో అల్లు అర్జున్.. అక్కడ ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్
NZ vs Pak | new-zealand | telugu-sports-news | telugu-cricket-news | latest-telugu-news | today-news-in-telugu