/rtv/media/media_files/2025/02/10/WttYICbllgca3Csv6p4A.jpg)
Kane Williamson unbeaten 133 fired New Zealand to the final of the ODI tri-series in Pakistan
భారత్ ఓవైపు ఇంగ్లండ్‌తో స్వదేశంలో 3 వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మరోవైపు పాకిస్థాన్ వేదికగా ముక్కోణపు (వన్డే ఫార్మాట్) జరుగుతోంది. ఈ సిరీస్ న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ మధ్య రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే నేడు (సోమవారం) లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో సౌతాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది.
Also Read: వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?
న్యూజిలాండ్ ఘన విజయం
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి దాదాపు 304 రన్స్ కొట్టింది. ఇక ఈ లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ కాస్త తడబడినా విజయాన్ని దక్కించుకుంది.
Also Read: ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!
8 బాల్స్ మిగిలుండగానే ఆ భారీ టార్గెట్‌ను ఛేదించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ చెలరేగిపోయాడు. దాదాపు 100కి పైగా పరుగులు చేసి దుమ్ము దులిపేశాడు. 113 బంతుల్లో 133*రన్స్ చేసి ఔరా అనిపించాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. విలియమ్సన్ దాదాపు 5 ఏళ్ల 8 నెలల తర్వాత వన్డేల్లో సెంచరీ చేయడం గమనార్హం.
Also Read: డాంకీ రూట్ లో అమెరికా వెళ్తూ..పంజాబ్ యువకుడి మృతి!
రికార్డు క్రియేట్
ఈ సెంచరీతో కేన్ విలియమ్సన్ ఓ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీని ద్వారా అత్యంత వేగంగా (159 ఇన్నింగ్స్)లో 7000 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అతడు ఈ ఫీట్‌ను విరాట్ కోహ్లీ (161 ఇన్నింగ్స్‌లు) రికార్డును బద్దలు కొట్టి సాధించాడు. ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఆషీమ్ ఆమ్లా (151 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు.
Also Read: బంగ్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ డేవిల్ హంట్..1300 మంది అరెస్ట్!