MS Dhoni IPL Retirement: ధోనీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. IPLకి ధోనీ గుడ్ బై..?

MS ధోని ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ అనంతరం అతడు రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని పోస్టులు చక్కర్లు కొట్టాయి. దానికి తోడు ధోనీ తల్లిదండ్రులు మ్యాచ్‌ను లైవ్‌లో చూడటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లైంది.

New Update
MS Dhoni To Retire after CSK vs DC IPL 2025 match

MS Dhoni To Retire after CSK vs DC IPL 2025 match

IPL 2025 సీజన్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే నిన్న (శనివారం) CSK Vs Dc మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. దాదాపు 25 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ అనంతరం ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ధోని రిటైర్మెంట్?

ఢిల్లీతో మ్యాచ్ తర్వాత MS ధోని రిటైర్మెంట్ తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. దానికి తోడు ధోనీ తల్లిదండ్రులు.. అలాగే భార్య, కూతురు కలిసి స్టేడియంలో మ్యాచ్‌ను లైవ్‌లో చూడటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లైంది. మ్యాచ్ అనంతరం ధోని తన తండ్రి పాదాలను తాకుతూ కనిపించాడు.  ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఈ ప్రచారంపై ధోనీ ఎలాంటి ప్రకటన చేస్తారు అనే టెన్షన్‌లో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ఇదిలా ఉంటే ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌‌లో ధోనీ ఆట తీరుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. మ్యాచ్‌ సమయంలో ధోని ఆఖరి వరకు క్రీజ్‌లో ఉన్నా.. ఎలాంటి పెద్ద షార్ట్‌లు ఆడకపోగా.. అతడు బాల్స్ డాట్ చేశాడని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు.. ధోని ఐపీఎల్ చాలా కాలంగా ఆడుతున్నాడని. అతడు ఇప్పుడు రిటైర్ అయ్యి.. కొత్త ఆటగాడికి అవకాశం ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు. 

  (ms-dhoni | latest-telugu-news | telugu-news | sports-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment