Shami: మరో వివాదంలో షమీ. ప్రభుత్వ నిధులు మింగేసిన సోదరి!

భారత బౌలర్ మహ్మద్ షమీ ఫ్యామిలీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. యూపీలో అమ్రోరా గ్రామ పెద్దగా ఉన్న షమీ సోదరి ఆయేషా.. పని చేయకుండానే ఫ్యామిలీలో 18 మందికి ఉపాధి హామీ డబ్బులు ఇప్పించినట్లు బయటపడింది. అధికారులు విచారణ చేపట్టి వారి పేర్లు తొలగించారు.  

New Update
shami up

Mohammed Shami Sister Implicated In MNREGA Fraud

Shami: భారత బౌలర్ మహ్మద్ షమీ ఫ్యామిలీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఇటీవలే రంజాన్ మాసంలో డ్రింక్స్ తాగిన షమీ, ఆ తర్వాత హోళీ ఆడిన అతని కూతురిపై విమర్శుల వెల్లువెత్తగా తాజాగా మరో సమస్యలో ఇరుక్కుకున్నారు. ఈ మేరకు షమీ సోదరి అత్త గులె ఆయేషా పేరు ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల జాబితాలో ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ఆయేషా భర్త కూడా ఉపాధి హామీ కూలి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

ఆయేషాపై చర్యలు..

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోరా గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్న ఆయేషా.. తన కుటుంబసభ్యుల పేర్లను జాతీయ ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో జిల్లా స్థాయి విచారణ జరిపి జాబితాలోని పేర్లను తొలగించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ నిధి గుప్తా తెలిపారు. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఆయేషాపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Also Read: పవన్ ఇదేం సినిమా కాదు.. టైమ్ వేస్ట్ చేయొద్దు: ప్రకాశ్ రాజ్ మరో సంచలనం!

‘ఈ ఇష్యూపై అధికారుల బృందం విచారణ ప్రారంభించింది. పని చేయకుండానే 18 మంది ఉపాధి డబ్బులు తీసుకున్నట్లు గుర్తించాం. షమీ సోదరి, ఆమె భర్త ఘజ్నావి, అతడి సోదరులు ఆమిర్ సుహైల్, నస్రుద్దీన్, షేఖు ఉన్నారు. ఆయేషా తన కొడుకు, కూతుర్లను ఇందులో చేర్చింది. 2021 నుంచి 2024 వరకు షమీ సోదరి కుటుంబసభ్యులు డబ్బులు తీసుకున్నా నిర్ధారించాం’ అని డీఎం నిధి గుప్తా వెల్లడించారు.

Also Read: ట్రంప్‌ సుంకాలు భారత్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి: రాహుల్ గాంధీ

 

https://www.youtube.com/watch?v=y8IgX9yxRMY

 mohammad-shami | sister | fraud | today telugu news 

Advertisment
Advertisment
Advertisment